Prabhas: ప్రభాస్ మనస్సుకు వాళ్లు ఫిదా అయ్యారట!

స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. బాహుబలి2 తర్వాత సినిమాల విషయంలో వేగం పెంచిన ప్రభాస్ ఏడాదికి కనీసం రెండు సినిమాలు విడుదలయ్యేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. వచ్చే ఏడాది ప్రభాస్ నటించిన మూడు సినిమాలు రిలీజయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మార్కెట్ ను పెంచుకోవడానికి ప్రభాస్ ప్రయత్నిస్తున్నారు. బాహుబలి సిరీస్ వల్ల ప్రభాస్ కు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు దక్కింది.

వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటించడంతో పాటు టాలెంటెడ్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తూ ప్రభాస్ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రభాస్ కు అభిమానులు ఉన్నారు. సినిమాల విషయంలోనే కాకుండా వ్యక్తిత్వం విషయంలో కూడా ప్రభాస్ అందనంత ఎత్తులో ఉన్నారు. తాజాగా ప్రభాస్ చేసిన పని ఆదిపురుష్ టీమ్ ను ఫిదా చేసింది. ప్రభాస్ రాముడిగా కృతిసనన్ సీతగా ఈ సినిమాలో నటిస్తుండగా సినిమాలో ప్రభాస్ పార్ట్ కు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తైంది.

ఈ సందర్భంగా ప్రభాస్ ఖరీదైన రాడో రిస్ట్ వాచెస్ ను చిత్ర బృందానికి బహుమతిగా ఇచ్చారు. ఆదిపురుష్ టెక్నికల్ టీమ్ కు చెందిన ఒక సభ్యుడు ఈ విషయాన్ని చెబుతూ సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేయగా ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ ఈ విధంగా బహుమతులు ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. గతంలో ప్రభాస్ తన దగ్గర పని చేసే జిమ్ ట్రైనర్ కు 73 లక్షల రూపాయల ఖరీదు చేసే రేంజ్ రోవర్ కారును గిఫ్ట్ గా ఇచ్చారు.

కొన్ని రోజుల క్రితం బన్నీ పుష్ప సినిమాకు పని చేసిన అసిస్టెంట్ డైరెక్టర్లకు గోల్డ్ రింగ్స్ ఇచ్చారు. స్టార్ హీరోలు వరుసగా తమ సినిమాలకు పని చేసిన వాళ్లకు బహుమతులు ఇస్తూ మంచి మనస్సును చాటుకుంటున్నారు. ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా జనవరి నెల 14వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ప్రభాస్ కు జోడీగా ఈ సినిమాలో పూజా హెగ్డే నటించారు.

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!

Most Recommended Video

మహేష్ టు నవీన్… ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన హీరోల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!
అఘోరా గెటప్‌ టాలీవుడ్‌ హీరోలకు కలిసొచ్చిందా!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus