Prabhas, Kriti Sanon: కృతి సనన్ పై సీరియస్ అయిన ప్రభాస్..మేటర్ ఏంటి?

బాలీవుడ్లో స్టార్ హీరో, స్టార్ హీరోయిన్ కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు అంటే.. ఆ సినిమాకి ఏర్పడాలని.. వారి మధ్య ప్రేమ వార్తలు క్రియేట్ చేస్తుంటాయి చిత్ర బృందాలు. అలాగే హీరోయిన్లకు కూడా హీరోలతో క్లోజ్ గా మూవ్ అవ్వాలని కూడా చెబుతుంటారట. ఇలాంటి సందర్భాన్ని ‘ఐ’ సినిమాలో దర్శకుడు శంకర్ చూపించాడు. ఈ విషయాన్ని పక్కన పెడితే.. ‘ఆదిపురుష్’ సినిమాలో ప్రభాస్, కృతి సనన్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాపై హైప్ పెరగాడికో ఏమో కానీ ప్రభాస్, కృతి ప్రేమలో ఉన్నట్లు..

త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు బాలీవుడ్ మీడియా ప్రచారం చేసింది. ఓ టీవీ షోలో హీరో వరుణ్ ధావన్ కూడా కృతి ప్రస్తుతం ఓ సౌత్ హీరోతో ప్రేమలో ఉందని, ఆమెనే పెళ్లి చేసుకోబోతోంది అని చెప్పాడు. అంతే ఇది నిజమే అని దేశమంతా కోడై కూసింది. కానీ ఇందులో నిజం లేదని ప్రభాస్ ‘అన్ స్టాపబుల్’ షోలో క్లారిటీ ఇచ్చాడు. కృతి సనన్ కూడా అందులో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది.

దీంతో అంతా ఈ విషయాన్ని మర్చిపోయారు. కానీ ఇటీవల ఆమె ఓ సందర్భంలో మళ్ళీ ఈ విషయాన్ని గుర్తు చేసి అందులో ఏమీ లేదు అని చెప్పింది. ఇక్కడ అందరూ మర్చిపోయిన విషయాన్ని ఆమెనే గుర్తుచేసి మరీ మీడియా అంతా మాట్లాడుకునేలా చేసింది కృతి. దీంతో ప్రభాస్ కు కృతి పై కోపం వచ్చింది. వెంటనే ఆమెకు ఫోన్ చేసి గట్టిగా మందలించాడట. ‘ఆదిపురుష్’ సినిమా గురించి కూడా పక్కన పెట్టి..

అందరూ మర్చిపోయిన డేటింగ్ రూమర్లపై మళ్ళీ మాట్లాడటం ఏంటి అంటూ ప్రభాస్ ఓ రేంజ్లో ఫైర్ అయ్యాడట. ప్రభాస్ కు ప్రేమ, పెళ్లి విషయాల గురించి మాట్లాడుతుంటే బాగా కోపం వచ్చేస్తుంది. కృష్ణంరాజు గారి చివరి రోజుల్లో కూడా పెళ్లి ఊసెత్తితే ప్రభాస్ ఇలాగే ఫైర్ అయ్యేవాడని అతని సన్నిహిత వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఏదేమైనా ఇక కృతి మళ్ళీ క్లారిఫికేషన్స్ పేరుతో డేటింగ్ వ్యవహారాల పై స్పందించే అవకాశం ఉండకపోవచ్చు.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus