Prabhas: ఆ పాత్రకు ప్రభాస్ ఓకే చెబుతారా?

కేజీఎఫ్ ఛాప్టర్1, కేజీఎఫ్ ఛాప్టర్2 సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి ఘనవిజయం సాధించాయి. కేజీఎఫ్ ఛాప్టర్ 3 ఎప్పుడు మొదలవుతుందో క్లారిటీ లేకపోయినా ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. యశ్, ప్రశాంత్ నీల్ మరోసారి ఈ సినిమాతో మ్యాజిక్ చేస్తారని ప్రేక్షకులు భావిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ కూడా గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తారని వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తున్నాయి. కొన్నిరోజుల క్రితం యశ్, ప్రభాస్ కాంబినేషన్ లో ప్రశాంత్ నీల్ మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కిస్తే బాగుంటుందని కొంతమంది నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

Click Here To Watch NOW

అయితే ప్రభాస్ మల్టీస్టారర్ సినిమాలలో నటించడానికి ఓకే చెబుతారో లేదో చెప్పలేం. కేజీఎఫ్3 సినిమాలో ప్రభాస్ గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తే మాత్రం బాగుంటుందని ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రశాంత్ నీల్ తలచుకుంటే మాత్రం ప్రభాస్ కేజీఎఫ్3 సినిమాలో కొన్ని నిమిషాల పాటు కనిపించడానికి ఓకే చెప్పే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ సినిమాలలో ఏ సినిమా మొదట విడుదలవుతుందో కూడా ప్రేక్షకులకు క్లారిటీ లేదు.

మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ ఒక సినిమాకు ఓకే చెప్పగా ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ రావాల్సి ఉంది. ప్రభాస్ నటించిన ఆదిపురుష్, సలార్ సినిమాలు వచ్చే ఏడాది విడుదల కానున్నాయి. కొన్ని నెలల గ్యాప్ లోనే ఈ రెండు సినిమాలు విడుదలయ్యే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుండటం గమనార్హం. ప్రభాస్ మారుతి కాంబో మూవీ, ప్రాజెక్ట్ కె 2024 సంవత్సరంలో విడుదల కానున్నాయని తెలుస్తోంది.

ప్రభాస్ ఈ ప్రాజెక్ట్ లతో పాటు మరికొన్ని ప్రాజెక్ట్ లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం అందుతోంది. బాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా ప్రభాస్ కు భారీస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus