కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభాస్

‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ డైరెక్షన్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న సాహో సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. యువీ క్రియేషన్స్ బ్యానర్లో భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ స్టడీగా సాగుతోంది. ఒకేసారి మూడు భాషల్లో షూట్ చేయడం వల్ల ముందుగా అనుకున్న డేట్స్ సరిపోవడం లేదని టాక్. అంతేకాదు ఎక్కువగా విజువల్ ఎఫెక్ట్స్ పని ఉండడంతో పోస్ట్ ప్రొడక్షన్ కి కూడా ఎక్కువ రోజులు పట్టేట్టు ఉందని సమాచారం. దీని వల్ల అభిమానులు నిరాశ పడకూడదని ప్రభాస్ ఓ నిర్ణయం తీసుకున్నారు. కొత్త సినిమాని కంప్లీట్ చేయాలనీ చూస్తున్నారు. అందుకే సాహో తర్వాత చేయాల్సిన సినిమాకి ఇప్పుడే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహించనున్న ఈ మూవీని గోపి కృష్ణ ఫిలిమ్స్ బ్యానర్లో కృష్ణం రాజు నిర్మించనున్నారు. ప్రభాస్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్న రాధాకృష్ణ కి అతను ఒకే చెప్పడంతో పనులు మొదలెట్టారు. ఈ మూవీ టెక్నీషియన్లు, ఆర్టిస్టులను ఎంపిక చేస్తున్నారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది తో మ్యూజిక్ సిట్టింగ్స్ త్వరలో మొదలుకానున్నాయి. అలాగే తాజాగా హీరోయిన్ ఫిక్స్ అయినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. డీజే సినిమా ద్వారా పరిశ్రమ దృష్టిలో పడ్డ పూజా హెగ్డేని ప్రభాస్ కి జోడీగా తీసుకున్నట్లు తెలిసింది. ఏప్రిల్ నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాని సెప్టెంబర్ లోపున పూర్తి చేయాలని చిత్ర బృందం భావిస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus