అన్నీ పక్కాగా సెట్ చేసుకున్నాడు..!

ఇటీవల రంగారెడ్డి జిల్లాకు చెందిన శేరిలింగంపల్లి మండలం రాయ్‌దుర్గం పన్మక్త అనే విలేజ్ లోని హీరో ప్రభాస్ కు చెందిన గెస్ట్ హౌస్ ను రెవిన్యూ అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే..! దీంతో తన ఆస్తి విషయంలో ఎటువంటి నోటీసులు పంపకుండా తన గెస్ట్ హౌజ్ ను సీజ్ చేయడం పట్ల ప్రభాస్ హైకోర్టులో డిసెంబర్ 21 న (నిన్న) పిటిషన్ దాఖలు చేసాడు.

ఇక ఈ విషయం పై ప్రభాస్ తరపు న్యాయవాది ఈ స్థలాన్ని 2005లో బి.వైష్ణవిరెడ్డి, ఉషా, బొమ్మిరెడ్డి శశాంక్‌రెడ్డిల నుండీ కొనుగోలు చేశామనీ, ఈ భూమిపై ఎటువంటి వివాదాలు లేవని ప్రభాస్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఎప్పుడూ క్రమం తప్పకుండా ఇన్కమ్ టాక్స్ మరియు విద్యుత్‌ బిల్లులు చెల్లిస్తున్నామని తెలియజేసారు. ఈ విధంగా ప్రభాస్ కు చట్ట అన్ని అర్హతలు ఆ గెస్ట్ హౌజ్ పై ఉన్నాయని… కాని రెవిన్యూ అధికారులు మాత్రం నిబందనలను మీరు వ్యతిరేకంగా గెస్ట్ హౌజ్ ను సీజ్ చేశారని వాదించినట్టు తెలుస్తుంది. ఇక ఎటువంటి వివాదాలు లేకపోయినా ముందు జాగ్రత్త తీసుకుని ఈ భూమి క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నట్టు కోర్టుకు తెలిపారు. ఇందుకోసం 1.05 కోట్ల వరకు ఫీజును కూడా చెల్లించినట్టు తెలియజేసారు. ఇప్పటికీ ఈ దరఖాస్తు ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉందని చెప్పారు. అయితే రెవెన్యూ అధికారులు మాత్రం మా భూమిని బలవంతంగా ఖాళీ చేయించేందుకు ప్రయయత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రభాస్ న్యావాది వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను డిసెంబర్ 31కి వాయిదా వేసింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus