‘బాహుబలి’ (Baahubali) తర్వాత ప్రభాస్ (Prabhas) కథల ఎంపికలో చాలా మార్పు వచ్చింది. అతని మాస్ కటౌట్ కి తగ్గట్టు..సినిమాలు చేసి సేఫ్ గేమ్ ఆడాలని అతను అనుకోవడం లేదు. ఒక సినిమాకి ఇంకో సినిమాకి పొంతన లేకుండా.. ఒక జోనర్ కి స్టిక్ అవ్వకుండా సినిమాలు చేస్తున్నాడు. ‘బాహుబలి’ తర్వాత యాక్షన్ జోనర్ లో ‘సాహో’ (Saaho) చేశాడు. ఆ తర్వాత ‘రాధే శ్యామ్’ (Radhe Shyam) ఓ డిఫరెంట్ లవ్ స్టోరీ. ‘ఆదిపురుష్‘ (Adipurush) ఓ మైథలాజికల్ డ్రామా. ‘సలార్’ (Salaar) మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్.
‘కల్కి 2898 ad’ (Kalki 2898 AD) మైథలాజికల్ టచ్ ఉన్న ఓ సైన్స్ ఫిక్షన్ డ్రామా. ఇప్పుడు చేస్తున్న ‘ది రాజా సాబ్’ (The Rajasaab) ఓ హర్రర్ రొమాంటిక్ డ్రామా.హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సినిమా కూడా 1945 ఆ టైంలో జరిగే ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామా. ప్రభాస్ ఇలా డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాడు కాబట్టే .. అతని రేంజ్ కూడా పెరుగుతూ వస్తుంది.
హీరోయిన్ తో రొమాన్స్, కామెడీ ట్రాక్స్, మాస్ ఎలిమెంట్స్..ఇలా అనవసరమైన ఎలిమెంట్స్ తో కథలు చెబుతుంటే ప్రభాస్ కి నచ్చడం లేదట. వాస్తవానికి ప్రభాస్ 25వ సినిమాగా సిద్ధార్థ్ ఆనంద్ (Siddharth Anand) సినిమా వస్తుందని గతంలో ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రాజెక్టు వర్కౌట్ కాలేదు. తర్వాత కొరటాల శివ.. ప్రభాస్ ను కలిసి ఓ కథ చెప్పారట. అది ఎందుకో ప్రభాస్ కి నచ్చలేదు.
అన్నీ అనుకున్నట్టు అయ్యి ఉంటే ప్రభాస్ 25వ సినిమా కొరటాల డైరెక్షన్లో రావాలి. కానీ ప్రాజెక్టు సెట్ అవ్వలేదు. తర్వాత హను చెప్పిన కథని ఓకే చేశాడు ప్రభాస్. కానీ కొరటాల శివ (Koratala Siva) మాత్రం ‘దేవర పార్ట్ 2’ (Devara) పూర్తయ్యాక ప్రభాస్ తో సినిమా చేస్తానని ఇటీవల చెప్పాడు. అది వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. కానీ ‘దేవర’ హిట్ అయితేనే కొరటాలకి ఏదైనా సాధ్యమవుతుంది.