కేరళలో దసరా సందర్భంగా విడుదలైన పులి మురుగన్ చిత్రం భారీ వసూళ్లను రాబడుతోంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా 25 కోట్లతో నిర్మితమైన ఈ మలయాళం మూవీకి అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. అక్టోబర్ 7 న రిలీజ్ అయిన ఈ చిత్రం నేటికీ 35 కోట్లను వసూల్ చేసింది. మల్లూవుడ్ చరిత్రలో వందకోట్ల మార్క్ ని దాటే మొదట మూవీగా దీనిని సినీ వర్గాలు అభివర్ణిస్తున్నాయి.
అంతలా ఆకట్టుకోవడంతో అభిషేక్ ఫిలిమ్స్ వారు పులి మురుగన్ రీమేక్ (భారతీయ అన్ని భాషల్లో ) హక్కులను అధిక మొత్తం ఇచ్చి కొనుగోలు చేశారు. ఈ కథను తెలుగు, తమిళంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో తెరకెక్కించాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు. బాహుబలితో డార్లింగ్ దక్షిణాదిన అందరికీ దగ్గరయ్యారు. కాబట్టి ప్రభాస్ ని ఒప్పించాలని అభిషేక్ ఫిలిమ్స్ వారు భావిస్తున్నారు. దర్శకునిగా మలయాళ వెర్షన్ ని తీసిన వ్యాసక్ నే ఎంచుకున్నారు. ఈ సినిమా క్లైమాక్స్ లో పులితో మోహన్ లాల్ చేసే రియల్ ఫైట్ హైలెట్ గా నిలిచింది. ఆ సీన్ ప్రభాస్ చేస్తే మరింత బాగుంటుందని “పులి మురుగన్” ని చూసిన వారంతా ఆశపడుతున్నారు.
https://www.youtube.com/watch?v=Dazf-YFJ4t4