Prabhas: ఈ వార్త గురించి అనిల్ క్లారిటీ ఇస్తారా?

రవితేజ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన రాజా ది గ్రేట్ సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. రవితేజ కామెడీ టైమింగ్, అనిల్ రావిపూడి మార్క్ డైలాగ్స్, ఆకట్టుకునే కథ, కథనం ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించాయి. ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కితే బాగుంటుందని ఈ సినిమా అభిమానులు సైతం కోరుకుంటున్నారు. అయితే రాజా ది గ్రేట్2 లో ప్రభాస్ నటిస్తారంటూ ఒక వార్త జోరుగా ప్రచారంలోకి వచ్చింది.

ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. సలార్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్, ఆదిపురుష్ సినిమాలతో ప్రభాస్ రేంజ్ మారబోతుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు. అయితే ప్రభాస్ అనిల్ రావిపూడికి ఛాన్స్ ఇస్తారా? ఇవ్వరా? అంటే ఇవ్వరని కచ్చితంగా చెప్పలేమని ఫ్యాన్స్ సైతం భావిస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో డబుల్ హ్యాట్రిక్ సాధించిన డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకరు. సినిమాలో ఎంటర్టైన్మెంట్ కు ప్రాధాన్యత ఇస్తూనే యాక్షన్ సన్నివేశాలతో కూడా మెప్పించగల టాలెంట్ అనిల్ రావిపూడి సొంతమని చెప్పవచ్చు.

మారుతికి ఛాన్స్ ఇచ్చిన ప్రభాస్ అనిల్ రావిపూడికి ఛాన్స్ ఇవ్వడంలో ఆశ్చర్యం అయితే లేదు. అయితే ప్రభాస్ అనిల్ రావిపూడి కాంబో మూవీ కొత్త కథతో తెరకెక్కితే బాగుంటుంది తప్ప రాజా ది గ్రేట్ కు సీక్వెల్ గా తెరకెక్కితే బాగుండదని కామెంట్లు వినిపిస్తున్నాయి. రాజా ది గ్రేట్2 గురించి వైరల్ అవుతున్న వార్త నిజం కాదని ప్రభాస్ అభిమానులు భావిస్తున్నారు అనిల్ రావిపూడి సైతం ఈ వార్త గురించి స్పందించి క్లారిటీ ఇస్తే బెటర్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అనిల్ రావిపూడి ప్రస్తుతం బాలయ్య సినిమా స్క్రిప్ట్ పనులతో బిజీగా ఉన్నారు. సెప్టెంబర్ చివరి వారం నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాతో మరో సక్సెస్ ను సొంతం చేసుకుంటానని అనిల్ రావిపూడి కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus