ఆసియాలోనే అత్యంత సెక్సీయస్ట్ హీరో మన ప్రభాస్!

మన రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ రోజురోజుకీ పెరిగిపోతోంది. “బాహుబలి” తర్వాత వరల్డ్ వైడ్ క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ స్టార్ డమ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ప్రపంచవ్యాప్తం అయిపోయింది. ఇప్పుడు ప్రభాస్ ఆసియా ఖండంలోనే సెక్సీయస్ట్ మెన్ గా నిలిచాడు. ఇది కేవలం సినిమాకి సంబంధించిన సర్వే మాత్రమే కాదు.. యావత్ ఆసియా ఖండంలోని ప్రముఖులందరి పేర్ల మీద కండక్ట్ చేసిన లిస్ట్ లో ప్రభాస్ 13వ సెక్సీయస్ట్ మెన్ గా నిలిచాడు. ఈ లిస్ట్ లోనే మన ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ 10వ స్థానం కైవసం చేసుకోవడం విశేషం. ఇప్పుడే ఇలా ఉంటే “సాహో” సినిమాలో స్టైలిష్ లుక్ ను పూర్తిగా చూస్తే అదే లిస్ట్ లో టాప్ 5 లోకి వచ్చేస్తాడేమో.

ఇకపోతే.. ప్రభాస్ ప్రస్తుతం “సాహో” మరియు రాధాకృష్ణల సినిమాకి బ్రేక్ ఇచ్చి రెస్ట్ తీసుకొంటున్నాడు. కొంచెం గ్యాప్ అనంతరం ప్రభాస్ మళ్ళీ సాహో షూట్ లో పాల్గొంటాడు. ఆ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో క్లారిటీ లేదు కానీ.. ప్రభాస్ అభిమానులు మాత్రమే కాక యావత్ సినిమా అభిమానులు కూడా ఆ సినిమా కోసం చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus