Prabhas: రెండో ప్రయత్నంలో… ప్రభాస్‌ సినిమాతో ఆ బ్యానర్‌ పెద్ద స్థాయికి వెళ్తోందా?

ప్రభాస్‌ – సుకుమార్‌ కాంబినేషన్‌లో సినిమా కోసం ఎంతమంది వెయిట్‌ చేస్తున్నారు అని పోల్‌ పెడితే… వందకు వంద అవును అనే సమాధానమే వస్తుంది. అంతటి క్రేజ్‌ ఉన్న కాంబినేషన్‌ ఇది. దీంతో ఎప్పుడు ఈ సినిమా గురించి ప్రస్తావన వచ్చినా… ఫ్యాన్స్‌ ఫుల్‌ సందడి చేస్తుంటారు. అలాంటి కాంబినేషన్‌ రావడం కష్టమే అని లీక్‌ వస్తే… వినడానికి, నమ్మడానికి, ఒప్పుకోవడానికి కష్టంగానే ఉంటుంది. కానీ నమ్మక తప్పదు, ఒప్పుకోక తప్పదు అని అంటున్నారు సన్నిహితులు.

అయితే ఆ బ్యానర్‌లో సినిమా ఉంటుందట. అవును, మీరు అనుకుంటున్నది కరెక్టే. సుకుమార్‌ దర్శకత్వంలో సినిమా లేకపోయినా సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్‌లో సినిమా ఉంటుందట. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయని టాక్‌. త్వరలో సినిమాకు సంబంధించి అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ కూడా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఇక సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్‌లో సినిమా అంటే ఆ సినిమా కథ, కథనం లాంటి వాటిలో ఆయన హ్యాండ్‌ కచ్చితంగా ఉంటుంది. అలా ఆయన మార్గదర్శకంలో శిష్యుడు ఒకరు ప్రభాస్‌ను డైరెక్ట్ చేస్తారట.

కాబట్టి సుకుమార్‌ – ప్రభాస్‌ సినిమా లేదనే దిగులు అక్కర్లేదు అనే మాట కూడా వినిపిస్తోంది. ఇక సినిమా కథ ఎలా ఉంటుంది అనే మాటకొస్తే… సాయిధరమ్‌తేజ్‌ ‘విరూపాక్ష‌’ సినిమాలా ఇది కూడా ఓ అడ్వెంచ‌రెస్ థ్రిల్ల‌ర్ అని తెలుస్తోంది. అయితే ఈ సినిమాను ప్రభాస్‌ స్థాయికి తగ్గట్టుగా భారీ స్థాయిలో తెరకెక్కించి, పాన్‌ ఇండియా రేంజిలో విడుదల చేస్తారట. నటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక కూడా అలానే ఉంటుంది అంటున్నారు.

సుకుమార్‌ తన శిష్యుల కోసం, యువ దర్శకుల కోసం ‘సుకుమార్‌ రైటింగ్స్‌’ స్థాపించారు. ఈ బ్యానర్‌ మీద చాలా సినిమాలొచ్చాయి కూడా. అయితే ఎక్కువ శాతం వేరే బ్యానర్‌తో కలిపే ఉన్నాయి. ఇటీవల ‘పుష్ప 2’ సినిమా ఇలానే మొదలైంది. అది తొలి ప్రయత్నం అనుకుంటే.. ఇప్పుడు ప్రభాస్‌ సినిమా రెండో ప్రయత్నం అనుకోవచ్చు. మరి ఈ ప్రయత్నంలో సోలోగా సుకుమార్‌ వస్తే పెద్ద బ్యానర్‌గా మారే వైపు అడుగులు పడ్డట్టే.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus