Prabhas: ఆర్థిక పరిస్థితులు బాగలేక హీరో అయ్యాను… ప్రభాస్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ప్రభాస్ బాహుబలి సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. ఈ సినిమా అనంతరం ఈయన చేసే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ విధంగా పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన ఒక్కో సినిమాకు 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.

ఇలా అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్నటువంటి హీరోలలో ప్రభాస్ కూడా ఒకరు. ఇక ఈయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన సినీ కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. అసలు తనకు హీరో అవ్వడమే ఇష్టం లేదని ప్రభాస్ షాకింగ్ కామెంట్స్ చేశారు. చిన్నప్పటినుంచి తనకు వ్యాపార రంగంలోకి వెళ్లి బిజినెస్ చేయాలని ఆసక్తి ఉండేది. ముఖ్యంగా తనకు ఫుడ్ అంటే ఎంతో ఇష్టం తాను ఫుడ్డీ కావడంతో హోటల్ బిజినెస్ చేయాలని ఎంతో ఆశగా ఉండేదట.

తాను సినిమాలలోకి రాకపోయి ఉంటే తప్పనిసరిగా హోటల్ బిజినెస్ లోనే స్థిరపడేవాడినని ప్రభాస్ తెలిపారు. అయితే తన ఇష్ట పూర్వకంగా కాకుండా ఇష్టం లేనటువంటి సినిమా రంగంలోకి అడుగు పెట్టానని తెలిపారు. తనకు చిన్నప్పటి నుంచి నటన అంటే ఏమాత్రం ఇష్టం లేదు కానీ వ్యాపార రంగంలోకి వెళ్లాలంటే డబ్బు కావాలి అప్పట్లో మా కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉండేవి దాంతో తాను బిజినెస్ వైపు అడుగులు వేయలేదని,

ఇలానాన్న పెదనాన్న బలవంతంతో తాను ఇండస్ట్రీలోకి వచ్చానని ఈ సందర్భంగా ప్రభాస్ చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈయన కనక వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి ఉంటే ఒక మంచి టాలెంటెడ్ యాక్టర్ ని ఇండస్ట్రీ కోల్పోయేదని అభిమానులు భావిస్తున్నారు.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus