Prabhas: భారీ భూకంపం.. టెన్షన్ ప్రభాస్ ఫ్యాన్స్

ప్రభాస్(Prabhas) ఇటీవల ‘బాహుబలి ది ఎపిక్’ సినిమా ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లిన సంగతి తెలిసిందే.అక్కడ ప్రభాస్ కి సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. అక్కడ ప్రభాస్ మాట్లాడుతూ… “బాహుబలి తర్వాత రాజమౌళి, షోబు, లక్ష్మి గారు (షోబు భార్య) అందరూ జపాన్ అభిమానుల గురించి నాకు చాలా గొప్పగా చెప్పారు. నిజంగా మీరు చాలా బ్యూటిఫుల్. ఎమోషనల్ కూడా.!

Prabhas

గత 10 సంవత్సరాలుగా జపాన్ గురించి చాలా విన్నాను.ఇక్కడికి రావడం అనేది నా డ్రీమ్. ఈరోజు అది నిజమైంది. మీ అందరినీ కలుసుకోవడం సంతోషంగా ఉంది.ఇక నుండి ప్రతి సంవత్సరం జపాన్ కి వచ్చేందుకు ప్రయత్నిస్తా.” అంటూ చెప్పుకొచ్చాడు.అయితే మరోపక్క జపాన్ లో భారీ భూకంపం, సునామి వచ్చిన సంగతి తెలిసిందే.ప్రభాస్ కూడా అక్కడే ఉండటంతో ఇక్కడి అభిమానులు టెన్షన్ పడుతున్నారు.

సోషల్ మీడియాలో దీనిపై చర్చ కూడా నడుస్తున్న నేపథ్యంలో.. ‘రాజా సాబ్’ దర్శకుడు మారుతి స్పందించి అందరి టెన్షన్ ని తగ్గించారు. మారుతీ ఈ విషయంపై స్పందిస్తూ.. ‘ప్రభాస్ తో మాట్లాడాను. ఆయన టోకియోలో లేడు.. సేఫ్ గానే ఉన్నాడు. టెన్షన్ పడొద్దు బానే ఉన్నాను అని చెప్పారు. అభిమానులకు కూడా దైర్యం చెప్పారు’ అంటూ చెప్పుకొచ్చారు.

ఇక ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ కానుంది. దాదాపు 18 ఏళ్ళ తర్వాత ప్రభాస్ నటించిన సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుండటం విశేషంగా చెప్పుకోవాలి. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ కూడా ఆకట్టుకుంది.

అప్పుడు రాంచరణ్ కేమియో.. ఇప్పుడు వెంకటేష్ కేమియో.. కొంపతీసి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus