కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) మూవీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలై పాతిక రోజులు అవుతున్నా ఈ సినిమాకు ప్రతిరోజూ లక్షల సంఖ్యలో టికెట్లు బుక్ అవుతుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో నాలుగో వారంలో సైతం కల్కి 2898 ఏడీ సంచలనాలు కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. హిందీలో ఎక్కువ మొత్తం కలెక్షన్లు సాధించిన మూడో దక్షిణాది చిత్రంగా కల్కి 2898 ఏడీ నిలిచింది.
ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించిన ఏడో సినిమాగా ఈ సినిమా నిలిచింది. హిందీలో ఆర్ఆర్ఆర్ (RRR) మూవీ 272 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించగా కల్కి 2898 ఏడీ 275.9 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకోవడం కొసమెరుపు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ప్రదర్శితం అవుతున్న సినిమాలన్నీ కల్కి రేంజ్ సినిమాలు కాకపోవడం ఈ సినిమాకు ప్లస్ అవుతోంది.
ఈ ఏడాది 1000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించిన తొలి సినిమా కల్కి 2898 ఏడీ కాగా ఈ రికార్డ్ ను బ్రేక్ చేసే సినిమాలేవో చూడాల్సి ఉంది. ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్ సైతం కల్కి 2898 ఏడీ మూవీ స్పెషల్ మూవీ అనే అభిప్రాయాన్ని వెల్లడిస్తుండటం గమనార్హం. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు వచ్చింది.
కల్కి సినిమాతో నాగ్ అశ్విన్ (Nag Ashwin) ప్రేక్షకులను మరో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లారని ఫ్యాన్స్ చెబుతున్నారు. థియేటర్లలో సరైన సినిమా లేని సమయంలో కల్కి 2898 ఏడీ విడుదల కావడంతో ఈ సినిమా కలెక్షన్ల జోరుకు ఇప్పట్లో బ్రేక్ వేయడం కష్టమేనని చెప్పవచ్చు. అమితాబ్ (Amitabh Bachchan) సైతం కల్కి 2898 ఏడీ సినిమా గురించి పలు సందర్భాల్లో ప్రశంసల వర్షం కురిపించడం కొసమెరుపు.