స్టార్ హీరో ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువేపాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి ప్రభాస్ సినిమాలు ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే ప్రభాస్ సినిమాలు అభిమానులను కాస్త నిరాశ పరుస్తున్నాయని చెప్పాలి .ఇలా ప్రబాస్ సినిమాలో నిరాశపరిచినప్పటికీ ఈయన మార్కెట్ ఏమాత్రం తగ్గకపోవడంతోనే ప్రభాస్ రేంజ్ ఏంటో తెలుస్తుంది. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాదే శ్యామ్, ఆది పురుశ్ వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
అయితే ఈ సినిమాలేవి అభిమానులను సందడి చేయలేకపోయాయి. ఈ క్రమంలోనే (Prabhas) ప్రభాస్ నటిస్తున్నటువంటి సలార్, కల్కి సినిమాలపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. సెప్టెంబర్ నెలలో ప్రభాస్ నటించిన సలార్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఇక సినిమాల పరంగా ప్రభాస్ ఎలా ఉంటారో మనకు తెలిసిందే. ఇక వ్యక్తిగత విషయానికి వస్తే ఈయన ప్రతి ఒక్కరితోనూ చాలా ప్రేమగా ఉంటారు. ఇక కుటుంబ సభ్యుల విషయానికి వస్తే అందరి బాధ్యతలను ప్రభాస్ చూసుకోవడమే కాకుండా వారి పట్ల చాలా మంచిగా నడుచుకుంటూ ఉంటారు.
తన పెదనాన్న కృష్ణంరాజు చనిపోవడంతో తన కుటుంబ సభ్యుల బాధ్యతలన్నింటినీ ప్రభాస్ తీసుకున్నారు.ఇక కృష్ణంరాజు ప్రభాస్ ను ఇండస్ట్రీలోకి రమ్మని ప్రోత్సహించడంతోనే ఈయన ఇండస్ట్రీలోకి వచ్చారు తన వల్లే ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారని చెప్పాలి. ఇక ప్రభాస్ తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు.ఈయన కూడా నిర్మాతగా ఇండస్ట్రీలో పనిచేశారు అయితే ఈయన ప్రభాస్ ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాతనే అనారోగ్య సమస్యలతో మరణించారు.
అయితే తన కుమారుడు ఈశ్వర్ సినిమా చూసినటువంటి సూర్యనారాయణ తన కొడుకు ఇండస్ట్రీలో మంచి స్థాయిలో ఉంటారని భావించారట ఇలా తండ్రి అనుకున్న విధంగానే ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఇకపోతే సూర్యనారాయణ రాజుగారు చనిపోవడానికి ముందు ఆయన కోసం ప్రభాస్ ఒక ఖరీదైన కారును కానుకగా ఇచ్చారట ఇదే తన తండ్రికి ఇచ్చిన చివరి కానుక.ఈ కారు కనుక ప్రభాస్ తన తండ్రికి కానుకగా ఇవ్వకపోయి ఉంటే తన జీవితంలో ఏదో వెలితి ఎప్పుడు తనని వెంటాడుతూనే ఉండేదని చెప్పాలి.