మహిళల్ని ఎవరైనా ఒక్క మాట అంటే.. మిగిలిన మహిళలు అందరూ అంతెత్తున ఎగిరి ఆగ్రహం వ్యక్తం చేస్తారు. మొన్నీమధ్యే నటుడు శివాజీ వ్యాఖ్యల విషయంలో మనం ఈ పరిస్థితిని గమనించాం కూడా. అయితే మరి పురుషుల్ని ఎవరైనా, ఏమైనా అంటే ఇలానే మిగిలిన పురుషులు రియాక్ట్ అవుతారా? ఏమో కన్నడ నటి మాట్లాడిన మాటలు విన్నాక.. ఇదే డౌట్ వస్తోంది. ఎందుకంటే ఆమె మగాళ్లను కుక్కలతో పోల్చింది. అంతేకాదు పురుషుల గురించి చాలా ఇబ్బందికరంగానూ మాట్లాడింది.
కన్నడలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, తెలుగులో ఒకట్రెండు సినిమాలు చేసిన హీరోయిన్, ఆ తర్వాత పొలిటీషియన్ అయిపోయిన దివ్య స్పందన.. రీసెంట్ ట్రెండింగ్ టాపిక్ వీధి శునకాల గురించి మాట్లాడారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా విపరీత వ్యాఖ్యలే చేశారు. ఈసారి ఏకంగా మగాళ్లను కుక్కలతో పోల్చింది. దేశంలో వీధి కుక్కల సమస్య తీవ్రమవుతున్న నేపథ్యంలో వాటిని షెల్టర్లకు తరలించాలంటూ గతేడాది జులైలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. దాని మీద జరుగుతున్న చర్చలో భాగంగానే దివ్య ఇప్పుడీ కామెంట్లు చేసింది.

ఇటలీవల ఈ కేసు విషయమై సుప్రీం కోర్టులో వాదనలు జరుగుతున్నప్పుడు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రవర్తన ఆధారంగా వీధి కుక్కలను వర్గీకరించడం సరికాదని, ఈ కుక్క కాటేస్తుంది, ఆ కుక్క కాటేయదు అని తెలుసుకోవడం అసాధ్యమని న్యాయస్థానం అభిప్రాయపడింది. వీధి కుక్కల మూడ్‌ను ఎవరూ అర్థం చేసుకోలేరని పేర్కొంది. ఈ వ్యాఖ్యాలపై స్పందిస్తూనే రమ్య మగాళ్ల గురించి విపరీత వ్యాఖ్యలు చేసింది.
మగాళ్లను అర్థం చేసుకోవడం కష్టమని.. వాళ్లు ఎప్పుడు ఎవరిని రేప్ చేస్తారో, ఎవరిని చంపుతారో కనిపెట్టలేమని, కాబట్టి వారినీ జైల్లో పెట్టాలా అని దివ్య ప్రశ్నించారు. ఆ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. మనుషులకు, జంతువులకు పోలికనా.. మగాళ్లను కుక్కలతో పోల్చడమా అంటూ ఆమె మీద నెటిజన్లు మండిపడుతున్నారు.
