ప్రభాస్‌ చేతుల మీదుగా ‘అరకు రోడ్‌లో’ సాంగ్‌ టీజర్‌ విడుదల

రామ్‌ శంకర్‌, నిఖిషా పటేల్‌ హీరో హీరోయిన్లుగా శేషాద్రి క్రియేషన్స్‌ పతాకంపై వాసుదేవ్‌ దర్శకత్వంలో మేకా బాలసుబ్రహ్మణ్యం, బి. భాస్కర్‌, వేగిరాజు ప్రసాదరాజు, రామేశ్వరి నక్కా లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘అరకురోడ్‌లో’. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని ఆడియో విడుదలకు సిద్దంగా ఉంది. ఈ చిత్ర సాంగ్‌ టీజర్‌ను యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ మాట్లాడుతూ.. ‘ఎప్పుడురా పెళ్లి..’ అనే ఈ సాంగ్‌ నా గురించే రాసినట్లుంది. లిరిక్స్‌ చాలా క్యాచీగా ఉన్నాయి. సాంగ్‌ చాలా వెరైటీగా ఉంది. సహజంగా పూరీ గారు తన సినిమాలలో ట్యూన్స్‌, లిరిక్స్‌ ఆయనే రాస్తుంటారు. అలాగే ఈ చిత్ర దర్శకుడు వాసుదేవ్‌ కూడా మల్టీ టాలెంటెడ్‌లా కనిపిస్తున్నాడు. ఈ సాంగ్‌ అదిరిపోయింది. సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను..అని అన్నారు.

చిత్ర దర్శకుడు వాసుదేవ్‌ మాట్లాడుతూ.. ‘గెడ్డం తెల్లబడి పోతావుందే..’ అనే లిరిక్‌తో సాగే సాంగ్‌ టీజర్‌ను మా కోరిక మేరకు బాహుబలి, యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ గారు ఫిల్మ్‌ సిటీలోని బాహుబలి సెట్‌లో ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా మా టీమ్‌ అందరి తరుపున ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ పాటని నేను, రామాంజనేయులు కలిసి రాయడం జరిగింది. ప్రస్తుతం చిత్ర షూటింగ్‌ మొత్తం పూర్తయింది. సెప్టెంబర్‌ 10న సినీ ప్రముఖుల సమక్షంలో హైద్రాబాద్‌లో గ్రాండ్‌గా ఆడియో ఆవిష్కరణ జరుపనున్నాం.

రామ్‌శంకర్‌, నిఖిషా పటేల్‌, కమల్‌ కామరాజు, అభిమన్యు సింగ్‌, కోవై సరళ, థర్టీ ఇయర్స్‌ ఫృథ్వీ, కృష్ణ భగవాన్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సాహిత్యం: వాసుదేవ్‌, రామాంజనేయులు; ఎడిటర్‌: మార్తాండ్‌ కె. వెంకటేష్‌, సంగీతం:వాసుదేవ్‌, రాహుల్‌రాజ్‌; డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ: జగదీశ్‌ చీకటి, నిర్మాతలు: మేకా బాలసుబ్రహ్మణ్యం, బి. భాస్కర్‌, వేగిరాజు ప్రసాదరాజు, రామేశ్వరి నక్కా; రచన, దర్శకత్వం: వాసుదేవ్‌.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus