పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ‘కల్కి 2898 ఏడి’ (Kalki 2898 AD) విడుదలకు ముందే ఆయన నటించాల్సిన సినిమాల సంఖ్య దాదాపు ఆరేడు దాటింది. అయితే ఈ మద్య కాలంలో ఆయన కొన్ని ప్రాజెక్ట్‌లు పక్కన పెడతారనే ప్రచారం వినిపించడం మొదలైంది. ముఖ్యంగా ‘కల్కి’ సీక్వెల్‌ను హోల్డ్ లో పెట్టాలని అనుకున్నారట, అలాగే మోకాళ్ల నొప్పుల వల్ల ప్రభాస్ పూర్తిస్థాయి యాక్షన్ సన్నివేశాలు చేయలేరనే టాక్ వినిపించడంతో అభిమానుల్లో కలవరం మొదలైంది.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ప్రచారంలో ఎటువంటి నిజం లేదని స్పష్టంగా తెలుస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం అంగీకరించిన సినిమాలన్నింటికీ కట్టుబడి ఉన్నట్టు, ఒకదానిని కూడా మానేయాలన్న ఆలోచనలో లేడని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ప్రత్యేకంగా ‘కల్కి 2’ ఆగుతుందనే టాక్‌పై మరింత స్పష్టత వచ్చింది. నాగ్ అశ్విన్ (Nag Ashwin) పుట్టిన రోజు సందర్భంగా చేసిన పోస్ట్‌లో ప్రభాస్ స్వయంగా “కల్కి సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నాను” అని చెప్పడంతో ఈ గాసిప్‌కి ఫుల్ స్టాప్ పడింది.
ఇప్పటికే ‘ది రాజా సాబ్’ (The Raja saab) షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా ఈ ఏడాది చివర్లో థియేటర్లకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు హను రాఘవపూడి (Hanu Raghavapudi) తెరకెక్కిస్తున్న ‘ఫౌజీ’ సినిమాకు సంబంధించి షూటింగ్ పూర్తయ్యాక 2026లో భారీగా విడుదల చేయాలనే ప్లాన్ ఉంది. వీటితో పాటు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించే ‘స్పిరిట్’ (Spirit), ప్రశాంత్ నీల్‌తో (Prashanth Neel) ‘సలార్’ (Salaar) పార్ట్ 2, దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prasanth Varma), మూవీలు 2026లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.
ఈ ప్రాజెక్టులన్నింటికీ ప్రభాస్ ఇప్పటికే ఓకే చెప్పినట్టు తెలిసింది. అయితే ఒకేసారి అన్నింటిని పూర్తి చేయడం సాధ్యంకాదనేది బలమైన వాస్తవం. అందుకే ప్లానింగ్‌తో ముందుకు వెళ్లేందుకు స్టార్ హీరో ప్రయత్నిస్తున్నాడు. మోకాళ్ల సమస్య కూడా తక్కువయ్యిందని, ప్రస్తుతం ఆయన క్రమంగా యాక్షన్ షెడ్యూళ్లకు రెడీ అవుతున్నట్టు సమాచారం. మొత్తానికి ప్రభాస్ వెనుకాడుతున్నాడనేది కేవలం ఊహాగానమే. ఆయన అంగీకరించిన ప్రాజెక్ట్‌లన్నీ ఆగుతాయన్నదే తప్పు. ఒకవేళ ఈ లైనప్ గ్యాప్ లేకుండా కొనసాగితే వచ్చే మూడేళ్ళ వరకు ఫ్యాన్స్ కు వరుస సినిమాలు వస్తాయని చెప్పవచ్చు.