Prabhas: ప్రభాస్ తో కలిసి నటించే ఛాన్స్!

  • September 7, 2021 / 04:36 PM IST

కొందరు ఆర్టిస్ట్ లకు గానీ.. అభిమానులకు గానీ తమ అభిమాన హీరోలతో కలిసి నటించే ఛాన్స్ వస్తే ఎగిరిగంతేస్తారు. అలాంటి అవకాశమే ఇప్పుడు అందించడానికి రెడీ అవుతోంది ‘ప్రాజెక్ట్ K’ యూనిట్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. ఆయన నటించిన ‘రాధేశ్యామ్’ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ సినిమాతో పాటు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తోన్న ‘ఆదిపురుష్’ అనే సినిమా చేస్తున్నారు. ఇదికాకుండా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’లో నటిస్తున్నారు. ఇందులో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలతో పాటు ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ తో కలిసి ఓ సినిమాను ప్రారంభించారు. దీనికి ‘ప్రాజెక్ట్ K’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అయితే తాజాగా అభిమానులకు ఈ సినిమా యూనిట్ మంచి అవకాశం ఇచ్చింది.

‘ఫేసెస్ ఆఫ్ ఫ్యూచర్’ పేరుతో ఈ సినిమాలో నటించేందుకు కొత్త నటీనటులను ఆహ్వానిస్తున్నామని చిత్రబృందం ఓ ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 12వ తేదీన బెంగుళూరు, చెన్నైలలో, 15వ తేదీన పుదుచ్చేరి, కుచ్చిళ్లలో ఈ క్యాస్టింగ్ ఉంటుందని పేర్కొంది. నటుడు, మోడల్స్, డాన్సర్స్, మార్షల్ ఆర్టిస్ట్స్ ఇలా టాలెంట్ ఉన్న ఎవరైనా సరే ఆడిషన్స్ లో పాల్గొనడానికి తమకు మెయిల్ చేయాలని స్పష్టం చేసింది.


Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus