Prabhas: ప్రభాస్ శ్రద్ధ పెట్టాల్సిందే.. ఆ తప్పు మాత్రం అస్సలు చేయొద్దంటూ?

  • July 20, 2023 / 01:10 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉండగా ప్రభాస్ సినిమాలన్నీ కొన్ని నెలల గ్యాప్ లో విడుదలవుతున్నాయి. బాహుబలి2 సినిమా తర్వాత ప్రభాస్ సినిమాలేవీ ఆ రేంజ్ లో సక్సెస్ సాధించకపోవడం, యునానిమస్ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోలేకపోవడం ఫ్యాన్స్ ను ఎంతగానో బాధ పెడుతోంది. ప్రభాస్ సినిమాలపై ఇంత నెగిటివిటీ ఎందుకనే ప్రశ్నకు ఫ్యాన్స్ దగ్గర కూడా సమాధానం లేదు.

అయితే అదే సమయంలో ప్రభాస్  (Prabhas) సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభాస్ సినిమాల అప్ డేట్స్ ఉదయం సమయంలో రావడం, చెప్పిన సమయం కంటే ఆలస్యంగా రావడం ఫ్యాన్స్ ను బాధ పెడుతోంది. స్టార్ హీరో ప్రభాస్ ఈ విషయాలకు సంబంధించి జాగ్రత్త వహించాల్సి ఉంది. ప్రభాస్ పేరుపై వందల కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతోంది. ప్రభాస్ సినిమాలన్నీ పాన్ వరల్డ్ సినిమాలుగా తెరకెక్కుతుండగా ప్రభాస్ సినిమాలకు అత్యంత భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.

సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలు ప్రభాస్ కు బాహుబలిని మించిన విజయాలను అందిస్తాయని ఫ్యాన్స్ భావిస్తుండగా అందుకు భిన్నంగా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతోంది. ప్రభాస్ విషయంలో కావాలని టార్గెట్ చేస్తూ కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారా అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ తన సినిమాలకు సంబంధించి ఎలాంటి నెగిటివిటీకి ఛాన్స్ ఇవ్వకుండా జాగ్రత్త పడాల్సి ఉంది.

ప్రభాస్ రేంజ్ పెరుగుతుండగా రాబోయే రోజుల్లో ప్రభాస్ పాన్ వరల్డ్ స్థాయిలో మరింత ఎదగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రాజెక్ట్ కే సినిమాకు సంబంధించి రేపు మరిన్ని అప్ డేట్స్ రానుండగా ఈ సినిమాలు సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రభాస్ త్వరలో కొత్త సినిమాల షూటింగ్ లతో బిజీ కానున్నారు.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus