‘మిస్టర్ పర్ఫెక్ట్’ ఇప్పుడు ‘మిస్టర్ హ్యాండ్సమ్’…!

ప్రభాస్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇందులో ‘సాహో’ చిత్రం ఒకటి కాగా రెండోది ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ డైరెక్ట్ చేస్తున్న చిత్రం మరొకటి… దీనికి ‘జాన్’ అనే టైటిల్ ఈ చిత్రానికి పరిశీలిస్తున్నారు. ఇక ‘సాహో’ చిత్రంలో ఫుల్ యాక్షన్ హీరోగా కనిపిస్తుంటే… ‘ప్రభాస్ 20’ లో మాత్రం లవర్ బాయ్ గా కనిపించబోతున్నాడు. ఈ రెండు చిత్రాల్లోనూ డిఫరెంట్ లుక్స్ లో కనిపించబోతున్నాడట ప్రభాస్. తాజాగా విక్టరీ వెంకటేష్ కూతురి పెళ్ళి రిసెప్షన్ గచ్చిబౌలిలోని అనన్య కన్వెన్షన్‌లో ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకకి చాలా మంది సినీ సెలెబ్రిటీలు హాజరయ్యారు. ఇందులో భాగంగా మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా హాజరయ్యాడు. సరికొత్త లుక్ లో ప్రభాస్ ఇలా దర్శనమివ్వడం అందరినీ సర్ ప్రైజ్ చేసింది. ‘మిస్టర్ పర్ఫెక్ట్’ కాస్త ‘మిస్టర్ హ్యాండ్సమ్’ గా తయారయ్యాడని సోషల్ మీడియాలో కొందరు ప్రభాస్ అభిమానులు కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. ప్రభాస్ ఫార్మల్ లుక్ లో మంచి స్టైలిష్ గా కనిపిస్తున్న ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ‘సాహో’ చిత్రం పెండింగ్ యాక్షన్ సీన్లలో నటిస్తున్న ప్రభాస్.. వీటి కోసం జిమ్ లో తెగ వర్కౌట్లు చేస్తున్నాడంట. ఏమైనా సినిమా కోసం ప్రభాస్ చూపించే డెడికేషన్ కి అందరూ అభినందించాల్సిందే అనడంలో సందేహం లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus