‘కేజీఎఫ్’ దర్శకుడిని టార్గెట్ చేసిన ప్రభాస్..!

ప్రస్తుతం ప్రభాస్ .. సుజీత్ దర్శకత్వంలో ‘సాహో’ చిత్రం చేస్తూనే.. మరో వైపున రాధాకృష్ణ దర్శకత్వంలో తన 20 వ సినిమా కూడా చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక ఈ రెండు పూర్తయ్యే సరికి 2020 జనవరి అవుతుంది. అయినపాటికీ అటుతరువాత ప్రభాస్ తో సినిమా చేసేందుకు చాలామంది దర్శక నిర్మాతలు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ‘బాహుబలి’ చిత్రంతో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్. ఇప్పుడు ప్రభాస్ చిత్రం అంటే కనీసం నాలుగు భాషల్లో విడుదల చేయాల్సిందే. ఇంతటి క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ తో సినిమా చేస్తే మిగిలిన భాషల్లో కూడా గుర్తింపు తెచుకోవచ్చు అని చాలా మంది సిద్ధంగా ఉన్నారట.

ఇదిలా ఉండగా ప్రభాస్ మాత్రం ఓ క్రేజీ దర్శకుడితో పని చేయడానికి ఆసక్తి చూపుతున్నాడట. వివరాల్లోకి వెళితే ఇటీవల ‘కేజీఎఫ్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించాడు ప్రశాంత్ నీల్. తన దర్శకత్వంలో కన్నడలో రూపొందిన ‘కేజీఎఫ్’ చిత్రాన్ని తెలుగు,హిందీ భాషల్లోకి కూడా డబ్ చేసిన సంగతి తెలిసిందే. కోలార్ గోల్డ్ మైన్స్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇప్పటికే 100 కోట్ల గ్రాస్ ని దాటేసింది. తెలుగులో కూడా ఈ చిత్రం బ్లాక్ బస్టర్ దిశగా పయనిస్తుంది. ఇక ఈ చిత్రంలో హీరో యశ్ ను దర్శకుడు చూపించిన తీరు .. కథను డీల్ చేసిన విధానం ప్రభాస్ కి బాగా నచ్చేశాయట. దీంతో తనకు కూడా మంచి కథను సిద్ధం చేయమనీ .. ప్రశాంత్ నీల్ తో చెప్పాడట ప్రభాస్. కాబట్టి ప్రభాస్ కోసం మంచి సిద్ధం చేసే పనిలో ఉన్నాడంట ప్రశాంత్. ఈ కథ గనుక ప్రభాస్ కి నచ్చితే మరో భారీ చిత్రంలో ప్రభాస్ కనిపించడం ఖాయం అని చెప్పడంలో సందేహం లేదు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus