టాప్ డైరక్టర్ ఇచ్చిన కథలో ప్రభాస్ ని డైరక్ట్ చేయనున్న రాధాకృష్ణ

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమా సాహో గురించి కంటే తర్వాత జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో చేయనున్న 20 వ చిత్రం గురించి రోజుకో న్యూస్ బయటికి వస్తోంది. ఇది ఒక ఫాంటసీ కథని, ఈ చిత్రం ఎక్కువగా యూరప్ లోనే చిత్రీకరణ జరుగుతుందని సమాచారం. అదికూడా 1970 నాటి కాలంలో కథ సాగుతుందని ఫిలిం నగర్ వాసులు చెప్పారు. అందుకోసం ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ సెట్స్ డిజైన్స్ చేస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుంది. ఈ సినిమాకు బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది మ్యూజిక్ అందించనున్నారు. ఇలా చకచకా పనులు సాగుతున్నాయి.

తాజాగా వచ్చిన న్యూస్ ఏమిటంటే ఈ సినిమా కథని “ఐతే”, “అనుకోకుండా ఒకరోజు”, “మనమంతా”… వంటి విభిన్న సినిమాలను అందించిన చంద్రశేఖర్ యేలేటి రాసినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. “ఈ కథతో చంద్రశేఖర్ ఏలేటి సినిమా చేయాలనుకున్నారట. కానీ… కుదరలేదు. ఇది తెలిసి డైరెక్టర్ రాధాకృష్ణ ఆ కథ ప్రభాస్‌కి బాగుంటుందని తనకు ఇవ్వమని అడగడం.. దీనికి చంద్రశేఖర్ ఏలేటి ఓకే చెప్పడం జరిగిందని” చెప్పుకుంటున్నారు. చంద్రశేఖర్ కథలన్నీ విభిన్నంగా ఉంటుంది. కథే హీరోగా ఉంటుంది. మరి దేశవ్యాప్తంగా క్రేజ్ ఉన్న ప్రభాస్ కి అతను రాసిన స్టోరీ ఎలా సెట్ అవుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus