మిస్టర్ పర్ఫెక్ట్ డైరెక్టర్ కి ఒకే చెప్పిన రెబల్ స్టార్

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ నాలుగేళ్ళు బాహుబ‌లి చిత్రం కోసం త‌న పూర్తి స‌మ‌యాన్ని కేటాయించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా భారీ విజ‌యం సాధించ‌డంతో ఆయ‌న క‌ష్టానికి ప్ర‌తిఫ‌లం ల‌భించింది. అంత‌ర్జాతీయంగా గుర్తింపు వ‌చ్చింది. ప్ర‌స్తుతం సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ సాహో అనే చిత్రం చేస్తున్నాడు ప్ర‌భాస్. ఈ సినిమా త‌ర్వాత జిల్ ద‌ర్శ‌కుడు రాధా కృష్ణ‌తో ఓ సినిమా చేయ‌నున్నాడు. ఇప్పుడు మ‌రో ప్రాజెక్ట్‌ని కూడా సెట్ చేసిన‌ట్టు తెలుస్తుంది.

ప్ర‌భాస్‌తో మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ సినిమా తెర‌కెక్కించిన ద‌శ‌ర‌థ్ ఇటీవ‌ల ప్ర‌భాస్‌ని క‌లిసి ప‌రిణితితో కూడిన ల‌వ్ స‌బ్జెక్ట్‌ని వినిపించాడ‌ట. ఇది ప్ర‌భాస్‌కి ఎంత‌గానో న‌చ్చ‌డంతో ఈ సినిమాని త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి తీసుకెళ‌దామ‌ని కూడా అన్నాడ‌ట‌. భారీ బడ్జెట్‌తో ప‌ట్ట‌ణ నేప‌థ్యంలో ఈ సినిమాని తెర‌కెక్కించాల‌ని ద‌ర్శ‌కుడు భావిస్తున్న‌ట్టు టాక్. ప్ర‌స్తుతం ఫిలిం న‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్న ఈ వార్త‌కి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus