ప్రభాస్, పవన్, ఎన్టీఆర్, మహేష్ ల స్థానం పదిలం!

హీరోగా పరిచయం కావడం.. స్టార్ హీరోగా ఎదగడం అనేది .. అంత తేలికైన విషయం కాదు. నిరంతర శ్రమతోనే  పవన్, ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్ లు అతి తక్కువకాలంలో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. పవన్ తన జోష్ తో యువతలో ఉత్సాహం నింపుతాడు. అంతేకాదు అతని నిజాయితీ ఎంతోమందిని ఆకర్షించింది. మహానటుడు వారసుడిగా ఎన్టీఆర్ అడుగుపెట్టి తాతకు తగ్గ తనయుడిగా నిరూపించుకున్నారు. నటన, డ్యాన్స్ లలో అదరగొడుతూ దూసుకు పోతున్నారు. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్,  జై లవకుశ సినిమాలతో వరుసగా హిట్స్ అందుకుంటున్నారు. మురారి, ఒక్కడు, పోకిరి, దూకుడుమ్మ్ మహేష్ బాబు కెరీర్ లో మూల స్థంబాలు.

ఈ సినిమాలు ఇండస్ట్రీ హిట్ గా నిలిచి మహేష్ ని కృష్ణ వారసుడిగా నిలబెట్టాయి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మొదటి నుంచి మాస్ కథలతోనే వస్తూ తనకంటూ ఓ దారిని ఏర్పరుచుకున్నారు. వర్షం, ఛత్రపతి, మిర్చి సినిమాలతో అదరగొట్టాడు. బాహుబలితో భారత చలన చిత్ర పరిశ్రమకు ప్రశంసలు, కలక్షన్ల వర్షం కురిపించాడు. అందుకే ప్రభాస్, పవన్, ఎన్టీఆర్, మహేష్ లు ఒకే పరిశ్రమలో ఉన్నప్పటికీ.. ర్యాంక్స్ ఇవ్వడం కష్టం అవుతుంది. ఎవరి దారిలో వారే నెంబర్ వన్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus