‘రాధే శ్యామ్’ ఆన్ లొకేషన్ పిక్ వైరల్…!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. హ్యాపీగా ఇటలీలో షూటింగ్ చేసుకుంటున్నాడు. తెలుగురాష్ట్రాల్లో షూటింగ్ చేస్తూ ఉండి ఉంటే.. భారీ వర్షాలతో కచ్చితంగా చిత్రీకరణకు ఇబ్బంది ఏర్పడేది. కానీ ఇటలీలో ఉండడం వల్ల.. ఇదిగో ఇలా కూల్ గా షాట్ కోసం రెడీ అవుతున్నాడు. ఈ మధ్యనే ‘రాధే శ్యామ్’ చిత్రం షూటింగ్ నిమిత్తం .. ప్రభాస్ అండ్ టీం ఇటలీ వెళ్ళిన సంగతి తెలిసిందే. 15 రోజుల పాటు అక్కడ ఓ చిన్న షెడ్యూల్ జరుగనుంది.

అది పూర్తయ్యాక మళ్ళీ చిత్ర యూనిట్ సభ్యులు హైదరాబాద్ చేరుకుంటారని తెలుస్తుంది. సాధ్యమైనంత త్వరగా ఈ చిత్రాన్ని కంప్లీట్ చెయ్యాలని ప్రభాస్ భావిస్తున్నాడు. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ‘రాధే శ్యామ్’ షూటింగ్ స్పాట్ పిక్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ పిక్ లో ప్రభాస్ బ్లాక్ డ్రెస్ ధరించి చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. మేకప్ వేయించుకుంటూ చాలా కూల్ గా ప్రభాస్ ఈ పిక్ లో కనిపిస్తున్నాడు.

ఇటీవల కాలంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటినప్పుడు ప్రభాస్.. కాస్త ఒళ్ళు చేసిన్నట్టు కనిపించాడు. కానీ ఈ ఫొటోలో సన్నగా కనిపిస్తున్నాడు.ఇదిలా ఉండగా.. ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. ఆమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఇటీవల విడుదల చేశారు చిత్ర యూనిట్ సభ్యులు.ఈ చిత్రంలో పూజ… ప్రేరణ అనే పాత్ర పోషించబోతున్నట్టు కూడా స్పష్టంచేశారు.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus