ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. చిన్న సినిమా అనుకొని అతనితో మొదలుపెట్టినా పెద్ద సినిమా అయి కూర్చుంటోంది. దీనికి ‘సాహో’నే ఉదాహరణ. ‘బాహుబలి’ తర్వాత వచ్చిన ఆ సినిమాకు అమాంతం బడ్జెట్ పెరిగింది, స్పాన్ పెరిగింది, రేంజ్ పెరిగింది. అంతలా సినిమా హైప్‌ను తెచ్చుకుంది. అయితే వసూళ్లు కాస్త నిరాశపరిచాయని చెప్పొచ్చు. అయితే ఆ సినిమా ప్రభావం ప్రభాస్ మీద పెద్దగా లేదు. అంతేకాదు… ఇప్పుడు ప్రభాస్ రెమ్యూనరేషన్ కూడా భారీగా పెరుగుతూ వస్తోంది.
ప్రభాస్ లైనప్ ఇప్పుడు చాలా బిజీగా ఉంది. కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా వరుసగా సినిమాలు ఓకే చేసేస్తున్నాడు. మరోవైపు వరుసగా సినిమాల షూటింగ్ కూడా మొదలుపెట్టి వేగంగా పూర్తి చేసేస్తున్నాడు కూడా. అంతేకాదు కొత్త కథలు విని, ఓకే చేసేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రభాస్ రెమ్యూనరేషన్ అమాంతం పెరిగిపోయింది. ఒక్కో సినిమాకు మన డార్లింగ్ ₹వంద కోట్ల నుండి ₹150 కోట్ల వరకు వసూలు చేస్తున్నాడట. ఇంకా చెప్పాలంటే ఇవ్వడానికి వారే ముందుకొస్తున్నారట.
దీంతో ప్రభాస్ దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోగా అవతరించాడట. ఇదంతా ‘స్పిరిట్’ సినిమా పారితోషికం లెక్కలు బయటకు వచ్చాకే చెప్పుకుంటున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమాకు ప్రభాస్‌కు ₹150 కోట్లు పారితోషికంగా ముట్టజెప్పుతున్నారని టాక్. అయితే ఈ పారితోషికం అసలు లెక్కలు బయటకు రావనే విషయం తెలిసిందే. వస్తున్న వివరాల ప్రకారం అయితే… డార్లింగే టాప్.
Most Recommended Video
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!