అల్లు అరవింద్ ‘రామాయణం’లో రావణుడిగా ప్రభాస్, రాముడిగా హృతిక్?

‘బాహుబలి’ తరువాత భారీ బడ్జెట్ చిత్రాలు రూపొందించడానికి దర్శకనిర్మాతలు ధైర్యం చేస్తున్నారు. పెద్ద చిత్రాల్ని ఎలా మార్కెట్ చేయాలి.. ఎటువంటి నటీనటుల్ని ఎంచుకోవాలి అనే దాని పై దర్శక నిర్మాతలకి ఓ అవగాహన వచ్చేసింది. ఈ తరుణంలో టాలీవుడ్ బడా నిర్మాత అల్లు అరవింద్ ‘రామాయణం’ ప్రాజెక్ట్‌ను రెండు నెలల క్రితమే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రామాయణాన్ని చాలా వరకూ ప్రేక్షకులు చూసేసారు. అయితే అన్ని ఘట్టాలను చిత్రీకరించలేదు. దీంతో మొత్తం రామాయణాన్ని మూడు భాగాలుగా అది కూడా 3డి టెక్నాలజీతో ప్రేక్షకులకు అందించాలని నిర్మాతలు రెడీ అయ్యారు.

తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో ఈ రామాయణాన్ని తెరకెక్కించబోతున్నారు. అల్లు అరవింద్ తో పాటు మధు మంతెన, నమిత్ మల్హోత్ర కూడా నిర్మాతలుగా వ్యహరించబోతున్నారు. ‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారి, ‘మామ్’ ఫేమ్ రవి ఉద్యవార్ ఈ రామాయణం సిరీస్‌కు డైరెక్ట్ చేయబోతున్నారు. మొదటి భాగాన్ని 2021లోనే తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు.ఇక ఈ ‘రామాయణం’ లో హృతిక్ రోషన్ రాముడిగా, దీపికా పదుకొణె సీతగా నటించనున్నారట. ఇక ఈ భారీ బడ్జెట్ చిత్రంలో ప్రభాస్ కూడా నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. హిందీతో పాటు తెలుగు, తమిళంలో కూడా ఈ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు కాబట్టి ‘పాన్ ఇండియా స్టార్‌గా’ మారిన ప్రభాస్ అయితే కరెక్ట్ అని మేకర్స్ భావిస్తున్నారు. ప్రభాస్ నటిస్తే కచ్చితంగా ఇది పెద్ద సినిమా అవుతుంది. కానీ ప్రభాస్ అభిమానులు మాత్రం ప్రభాస్ ‘రావణుడి’ పాత్ర చేయడం ఇష్టం లేదంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇంకా స్క్రిప్ట్ దశలోనే ఉన్నాం కానీ నటీనటుల్ని ఫైనల్ చేయలేదని దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి..!

గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus