ఫిల్మ్ సిటీలో పోరాటం చేస్తున్న ప్రభాస్

ప్రస్తుతం సినీ పరిశ్రమలో అనుభవం కంటే.. కొత్త ఆలోచనే ఎక్కువమందిని ఆకట్టుకుంటోంది. అందుకే స్టార్ డైరక్టర్లు క్యూలో ఉన్నప్పటికీ యువ డైరక్టర్ సుజీత్ దర్శకత్వంలోనే నటించడానికి ప్రభాస్ ఒకే చెప్పారు. ఏడాది క్రితం మొదలయిన సాహో సినిమా పనులు ఎక్కడ రాజీ పడకుండా ముందుకు సాగుతున్నాయి. ప్రభాస్ కి వచ్చిన క్రేజ్ కి అనుగుణంగా నిర్మాతలు వంశీ, ప్రమోద్ లు ఖర్చుపెడుతున్నారు. 8 నిముషాల యాక్షన్ సీన్ కోసం 70 కోట్ల ఖర్చు పెట్టారంటే సినిమా ఎంత భారీగా రూపొందుతోందో అర్ధమవుతోంది. అబుదాబిలో హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న ఈ సీన్ సినిమాలో హైలెట్ గా నిలవనుంది. ఇప్పుడు మరో యాక్షన్ సీన్ తీస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన మార్కెట్‌ సెట్‌ లోనే కొత్త షెడ్యూల్ గత నెల మొదలయింది.

ఈ షూటింగ్ లో శ్రద్ధాకపూర్‌ తో పాటు కొంతమంది నటీనటులు పాల్గొంటున్నారు. నలభై రోజులకు పైగా ఈ షెడ్యూల్‌ జరగనుంది. నిన్నటి నుంచి కీలకమైన యాక్షన్ సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలిసింది. మరో వారం రోజుల పాటు కొనసాగే ఈ షెడ్యూల్ తో దాదాపు 80 శాతం షూటింగ్ కంప్లీట్ అవుతుంది. ఇక పాటల కోసం చిత్ర బృందం రొమేనియా కి వెళ్లనుంది. అక్కడ అందమైన లొకేషన్లలో రెండు పాటలను తెరకెక్కించనున్నారు. నీల్ నితిన్ ముకేష్, చుంకే పాండే, జాకీష్రాఫ్, మహేష్ మంజ్రేకర్, మందిర బేడీ, ఎవ్లిన్‌ శర్మ తదితరులు నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus