యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన ‘సాహో’ చిత్రం ఆగష్టు 30న విడుదలై… మొదటి షోతోనే డిజాస్టర్ టాక్ ను మూటకట్టుకుంది. డిజాస్టర్ టాక్ వచ్చాక ఎంత పెద్ద హీరో సినిమాకి అయినా కనీసం కలెక్షన్లు రావడం చాలా కష్టం. ఓపెనింగ్ వీకెండ్ ను ‘సాహో’ బాగా క్యాష్ చేసుకున్నాడు. అయితే ఆ తరువాత మాత్రం అదే జోరుని కొనసాగించడంలో విఫలమయ్యాడు. అయితే వీకెండ్ ముగిసాక డిజాస్టర్ వచ్చిన సినిమా.. పరిసర ప్రాంతాల్లోకి కూడా ప్రేక్షకులు వెళ్ళరు. కానీ తరువాత వీకెండ్ లో ‘సాహో’ పర్వాలేదనిపించేలా క్యాష్ చేసుకున్నాడు. ఇక ‘సాహో’ ఫుల్ రన్ ముగిసింది. ఇక క్లోజింగ్ కలెక్షన్ల వివరాలు తాజాగా బయటకి వచ్చాయి.
‘సాహో‘ ఫైనల్(క్లోజింగ్) ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
నైజాం | 29.52 cr |
సీడెడ్ | 12.38 cr |
వైజాగ్ | 10.22 cr |
ఈస్ట్ | 7.39 cr |
వెస్ట్ | 6.29 cr |
కృష్ణా | 5.14 cr |
గుంటూరు | 8.31 cr |
నెల్లూరు | 4.40 cr |
ఏపీ + తెలంగాణ | 83.65 cr |
కర్ణాటక | 16.75 cr |
కేరళ | 1.60 cr |
తమిళనాడు | 6.05 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 85.65 cr |
ఓవర్సీస్ | 38.60 cr |
వరల్డ్ వైడ్ టోటల్ | 232.60 (షేర్) |
‘సాహో’ చిత్రానికి 290 కోట్ల వరకూ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం ఫుల్ రన్ ముగిసేసరికి 232.60 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే 58 కోట్ల వరకూ నష్టాలు వచ్చాయన్న మాట. ఇక్కడ ఓ విషయాన్నీ గమనించాలి.. మొదటి రోజు ఈ చిత్రానికి వచ్చిన టాక్ ని బట్టి చూస్తే 150 షేర్ కూడా కష్టమే అని ట్రేడ్ పండితులు చెప్పారు. కానీ హిందీలో ఈ చిత్రం బాగా కలెక్ట్ చేయడంతో ఓవరాల్ గా 80 శాతం రికవరీ అయిపొయింది. 330కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందించగా.. థియేట్రికల్ బిజినెస్ 290 కోట్ల కు జరిగింది. ఇక ఫైనల్ రికవరీ 232.6 కోట్లు అయ్యింది. నాన్ థియేట్రికల్ గా 140 కోట్ల వరకూ నిర్మాతలకి వచ్చాయి. మొత్తంగా ‘సాహో’ 370 కోట్ల వరకూ రాబట్టాడు. ఈ చిత్రాన్ని చాలా వరకూ నిర్మాతలు ఓన్ రిలీజ్ చేసుకోవడంతో చాలా వరకూ వారికి ఒత్తిడి లేనట్టే అని చెప్పాలి. ఏమైనా ఓ డిజాస్టర్ టాక్ వచ్చిన సినిమాతో 200 కోట్లకు పైగా షేర్ ను రాబట్టుకోవడం అంటే.. ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్లో ఉందనేది స్పష్టం అవుతుంది.
‘సైరా’ నరసింహారెడ్డి లో ఆకర్షించే అంశాలు ఇవే!
‘బిగ్ బాస్ 3’ హౌస్ మేట్స్ ను సినిమా పోస్టర్లతో పోలిస్తే?