‘సాహూ’ లేటెస్ట్ అప్డేట్..!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘సాహూ’ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని యూ.వీ.క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం దాదాపు 70 శాతం వరకూ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని ఆగష్టు 15 న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఓ ఐటమ్ సాంగ్ ను కూడా ఉండబోతుందట. ఈ సాంగ్ ని భారీగా చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ఐటమ్ సాంగ్ కి పాప్ స్టార్ బెయాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతుందట. ఈ సాంగ్ లో వందలాది మంది బ్రెజిల్ డాన్సర్లు స్టెప్పులు వేయబోతున్నారట. ఇక ఈ పాటకి వైభవి మర్చంట్ కొరియోగ్రఫీని అందించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ పాట కోసం ప్రత్యేకంగా భారీ సెట్ వేయబోతున్నారట. ఇక ఈ పాటలో ప్రభాస్ .. బెయాన్స్ కలిసి వేసే స్టెప్పులకి ఫ్యాన్స్ విజిల్స్ వేస్తూ రచ్చ చేస్తారని తెలుస్తుంది. ఒక పక్క ఈ చిత్రం చేస్తూనే.. తన 20 వ చిత్రంలో కూడా నటిస్తున్నాడు ప్రభాస్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus