దుబాయి లో భారీ షెడ్యూల్ మొదలయ్యేది ఎప్పుడంటే ?

  • April 6, 2018 / 01:34 PM IST

యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సాహో సినిమా తెలుగు చిత్ర పరిశ్రమని మరో మెట్టుకు తీసుకుపోనుంది. ఇప్పటివరకు వెండితెరపై చూడనివంటి యాక్షన్ సన్నివేశాలను ఇందులో చూడవచ్చు. అత్యంత సాహసమైన ఛేజింగ్ సీన్ కోసం సాహో టీమ్ నెల రోజులుగా ఏర్పాట్లు చేస్తోంది. దుబాయ్ లోని అత్యంత రద్దీ ప్రాంతాలుగా పేరుగాంచిన బుర్జ్ ఖలీఫా, వరల్డ్ ట్రేడ్ సెంటర్, ఇతిహాద్ టవర్(అబుదాబి) ప్రాంతాల్లో షూటింగ్ చేయనున్నారు. సినిమాలో కీలకమైన ఈ యాక్షన్ సీక్వెన్స్ 20 నిముషాలపాటు ప్రేక్షకులను ఆశ్చర్యపరచనుంది.

ఈ సన్నివేశాన్ని హాలీవుడ్ ఫైట్ మాస్టర్ కెన్నీ బేట్స్ ఆధ్వర్యంలో షూట్ చేయనున్నారు. ఈ భారీ షెడ్యూల్ ఈ నెల 10 వ తేదీ నుంచి మొదలవుతుందని బాలీవుడ్ సినీ విశ్లేషకుడు రమేష్ బాల ట్వీట్ చేశారు. దాదాపు 40 రోజులపాటు షూటింగ్ జరుగుతుందని సమాచారం. ఈ ఫైట్ కి సంబంధించిన మేకింగ్ ఫోటోలు బయటికి రాకుండా ఉండాలని ప్రత్యేక బృందాన్ని సుజీత్ ఏర్పాటు చేసినట్లు తెలిసింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ఏకకాలంలో తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో  హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్, విలన్స్ గా బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముకేష్, చుంకే పాండే లు నటిస్తున్నారు. జాతీయ స్థాయిలో మంచి పేరున్న బాలీవుడ్ సంగీత త్రయం శంకర్ – ఇషాన్ – లాయ్ లు  సంగీతాన్ని  అందిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus