Salaar Collections: ప్రభాస్ సలార్ ఫస్ట్ డే కలెక్షన్లు ఆ రేంజ్ లో ఉండనున్నాయా?

ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ సలార్ మూవీ బుకింగ్స్ తెలుగు రాష్ట్రాల్లో ఇంకా మొదలుకాలేదు. బుకింగ్స్ ఆలస్యంగా మొదలైనా సమస్య లేదని ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు భారీ స్థాయిలో ఉండబోతున్నాయని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ప్రభాస్ సలార్ కు రూ.120 కోట్ల ఓపెనింగ్ సాధ్యమేనని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఫస్ట్ డే కలెక్షన్లు ఇంతకన్నా ఎక్కువగా ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ సలార్ అంచనాలను అందుకోవడంతో పాటు అంచనాలను మించిన హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

సలార్ మూవీ డుంకీతో పోల్చి చూస్తే రెండు రెట్లు ఎక్కువ మొత్తం కలెక్షన్లు సాధించే ఛాన్స్ అయితే ఉంది. సలార్ లో ఇతర పాత్రలకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. కేజీఎఫ్, కేజీఎఫ్2 లను మించి ఈ సినిమా ఉండబోతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ గత సినిమాలు నిరాశపరిచినా సలార్ మూవీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో బుకింగ్స్ అంతకంతకూ పెరుగుతున్నాయి. కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో సైతం ఈ సినిమాకు బుకింగ్స్ అదిరిపోయాయి.

సలార్ ఫస్ట్ వీకెండ్ సమయానికే కొన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ కావడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రభాస్ రాజమౌళి కాంబో ఇంటర్వ్యూ రేపు రిలీజ్ కానుండటం గమనార్హం. ఈ ఇంటర్వ్యూతో సలార్ సినిమాపై అంచనాలు మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. సలార్ సినిమాతో కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తానని చెప్పిన ప్రశాంత్ నీల్ ఈ మూవీతో ఎలాంటి సక్సెస్ ను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.

సలార్ (Salaar) సినిమా రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సంచలనాలను క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది. సలార్2 షూటింగ్ వచ్చే ఏడాది మొదలవుతుందని మేకర్స్ చెబుతున్నా వాళ్ల మాటలు నిజమవుతాయో లేదో తెలియాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus