అమృత అయ్యర్ (Amritha Aiyer) అందరికీ తెలుసు కదా. రామ్ (Ram) నటించిన ‘రెడ్’ (Red) సినిమాలో ఓ హీరోయిన్ గా నటించింది. ఆ సినిమాలో పెద్దగా స్క్రీన్ స్పేస్ దక్కకపోయినా.. ఉన్నంతలో బాగా నటించి మంచి మార్కులు వేయించుకుంది. ఆ తర్వాత చేసిన ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ అనే సినిమా కూడా బాగానే ఆడింది. వాస్తవానికి ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ నే ఆమెకు తెలుగులో ఫస్ట్ మూవీ. కానీ కోవిడ్ వల్ల లెక్క మారింది.
ఇక ఆ తర్వాత ఈమె ‘అర్జున ఫల్గుణ’ (Arjuna Phalguna) అనే సినిమాలో చేసింది. అది పెద్దగా ఆడలేదు. అయితే ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ‘హనుమాన్’ (Hanu Man) పాన్ ఇండియా లెవెల్లో సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమాలో అమృత అయ్యర్.. కి మంచి పాత్రే దొరికింది. కానీ ఎందుకో ఆ సినిమాకి ఈమెకు దక్కాల్సిన అప్రిసియేషన్ దక్కలేదు. ప్రమోషన్స్ లో కూడా ‘హనుమాన్’ టీమ్ ఈమె గురించి ప్రస్తావించింది కూడా తక్కువే.
కానీ అమృత మాత్రం ‘హనుమాన్’ వల్ల తన పారితోషికం పెరిగిందని చెబుతుంది. త్వరలో ‘బచ్చల మల్లి’ (Bachhala Malli) సినిమాతో ఈమె ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమా ప్రమోషన్స్ లో ఈమె ఎక్కువగా పాల్గొంటుంది. ఈ క్రమంలో తన పెళ్లి విషయంలో ఉన్న ప్లానింగ్ ను కూడా బయటపెట్టింది. వచ్చే ఏడాది పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఆమెకు ఉందట. అయితే సినిమా పరిశ్రమకు చెందిన వాళ్ళు కాకుండా వేరే పరిశ్రమకు చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని ఆమె భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది.