ప్రభాస్ కి ఇష్టమైన బాలీవుడ్ హీరోయిన్స్ ఎవరంటే ?

సాధారణంగా అమ్మాయిలకు ఎక్కువగా లవ్ ప్రపోజల్స్ వస్తుంటాయి. కానీ అమ్మాయిలకంటే ఎక్కువగా ప్రేమ, పెళ్లి ప్రపోజల్ అందుకున్న అబ్బాయిల జాబితాలో ప్రభాస్ పేరు ముందు వరుసలో కచ్చితంగా ఉంటుంది. సామాన్యులు, సెలబ్రిటీలు అని మాత్రమే కాకుండా ప్రభాస్ ని అందరూ ఇష్టపడుతుంటారు. హీరోయిన్స్ డార్లింగ్ పక్కన నటించాలని కలలు కంటుంటారు. అందుకే సాహో సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కోసం ఎక్కువమంది పోటీ పడ్డారు. చివరికి ఆ ఛాన్స్ శ్రద్ధ కపూర్ అందుకుంది. ఇంతమందికి ప్రభాస్ అంటే ఇష్టపడుతున్నారు కదా.. మరి ప్రభాస్ కి బాలీవుడ్ లో ఏ హీరోయిన్ అంటే ఎక్కువ ఇష్టం? అనే అనుమానం అందరికీ వస్తుంది.

అదే ప్రశ్నను ప్రభాస్ ని అడిగితే.. ఆలోచించకుండా దీపికా పదుకునే, కత్రినా కైఫ్, అలియా బట్ అని చెప్పారు. ఈ విషయం వారికీ చేరిందో లేదో తెలియదు గానీ అక్కడి దర్శక నిర్మాతలు మాత్రం గుర్తు పెట్టుకున్నారు. వారి డేట్స్ ముందుగా తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఎందుకంటే సాహో తర్వాత ప్రభాస్ తెలుగు డైరక్టర్ రాధా కృష్ణ దర్శకత్వంలోనే సినిమా చెయ్యనున్నారు. దీని తర్వాత స్ట్రైట్ హిందీ మూవీ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. సో ఆ సినిమాలో హీరోయిన్స్ గా వీరిలో ఒకరిని సెట్ చేస్తే.. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ సూపర్ గా బాలీవుడ్ ఫిలిం మేకర్స్ ఆలోచన.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus