ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రాజెక్ట్ కె పేరుతో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలలో ఒకరైన అశ్వనీదత్ ఖర్చు విషయంలో రాజీ పడకుండా కథను నమ్మి ఈ సినిమా కోసం 500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ప్రభాస్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ఈ సినిమాలో నటిస్తున్నారు.
ప్రభాస్ తన సినిమాలకు పని చేసే ఆర్టిస్టులకు ఏ రేంజ్ లో మర్యాదలు చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రముఖ నటి భాగ్యశ్రీ, శృతిహాసన్, కృతిసనన్, శ్రద్ధా కపూర్ ఇప్పటికే ప్రభాస్ పంపించిన వంటకాలకు ఫిదా అయ్యామని కామెంట్లు చేశారు. తాజాగా ఈ జాబితాలో ప్రముఖ నటి దీపికా పదుకొనే కూడా చేరారు. ప్రభాస్ పంపించిన వంటకాలకు సంబంధించిన ఫోటోలను దీపికా పదుకొనే సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ప్రాజెక్ట్ కె షూటింగ్ కొరకు హైదరాబాద్ కు వచ్చిన దీపిక పదుకొనేకు ప్రభాస్ స్పెషల్ వంటకాలను తెప్పించటంతో పాటు ప్రభాస్ స్వయంగా వడ్డించాడని సమాచారం. ప్రాజెక్ట్ కె సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమవుతున్న దీపికా పదుకొనే ప్రభాస్ తెప్పించిన వంటకాలను చూసి ఆశ్చర్యపోయారు. దీపికా పదుకొనే వంటల ఫోటోలను షేర్ చేస్తూ ప్రభాస్ ను, నాగ్ అశ్విన్ ను ట్యాగ్ చేయడం గమనార్హం.
Most Recommended Video
‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!