Prabhas: డార్లింగ్ ప్రభాస్ గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ కెరీర్ ప్లానింగ్ వేరే లెవెల్ లో ఉంది. సలార్, సలార్2, ప్రాజెక్ట్ కే, స్పిరిట్ సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ కాగా ఈ సినిమాను కూడా భారీ లెవెల్ లోనే ప్లాన్ చేస్తున్నారు. ఈరోజు ప్రభాస్ పుట్టినరోజు కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ పుట్టినరోజు వేడుకలు భారీ రేంజ్ లో జరుగుతుండటం గమనార్హం.

2002 సంవత్సరంలో ఈశ్వర్ సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టిన ప్రభాస్ సినిమా సినిమాకు కెరీర్ పరంగా ఎదుగుతూ ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్నారు. బాహుబలి, బాహుబలి2 సినిమాలతో ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించారు. ఈ సినిమాలు సాధించిన రికార్డులలో చాలా రికార్డులు ఇప్పటికీ బ్రేక్ కాలేదనే సంగతి తెలిసిందే. ప్రభాస్ తన సినిమాతో రూ.5 వేల కోట్ల కలెక్షన్లను సాధించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

రాబోయే రోజుల్లో ప్రభాస్ ఈ టార్గెట్ ను కచ్చితంగా సాధిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. స్టార్ హీరో ప్రభాస్ ఖాతాలో ఇప్పటికే ఎన్నో రికార్డులు ఉన్నాయి. మేడమ్ టుస్సాడ్ లో మైనపు విగ్రహం కలిగిన మొదటి సౌత్ స్టార్ ప్రభాస్ కావడం గమనార్హం. యాక్షన్ జాక్షన్ అనే సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్ లో మెరిశారు. ఊహించని స్థాయిలో స్టార్ డమ్ ఉన్నా ప్రభాస్ తక్కువ సంఖ్యలో యాడ్స్ లో నటించారు.

ప్రజలకు చిన్న కష్టం వచ్చినా భారీ మొత్తంలో విరాళం ప్రకటించే హీరోలలో (Prabhas) ప్రభాస్ ముందువరసలో ఉంటారు. ఖాజిపల్లి రిజర్వ్ ఫారెస్ట్ భూమిని దత్తత తీసుకున్న ప్రభాస్ అక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. ప్రభాస్ కు ఏపీలోని శ్రీశైలం ఇష్టమైన ప్రదేశాలలో ఒకటి కావడం గమనార్హం. ఈ తరం హీరోయిన్లలో శ్రియ, త్రిష ప్రభాస్ కు ఇష్టమైన నటీమణులు కాగా రాబోయే రోజుల్లో ప్రభాస్ మరెన్నో విజయాలను అందుకోవాలని ఆశిద్దాం.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus