‘ప్రభాస్ 20’ లో ప్లే బాయ్ గా కనిపించనున్న ప్రభాస్..!

‘సాహో’ చిత్రం షూటింగ్ ఇంకా పూర్తికాక ముందే ప్రభాస్ మరో చిత్రాన్ని మొదలు పెట్టేసిన సంగతి తెలిసిందే. ‘జిల్’ చిత్ర దర్శకుడు రాధాకృష్ణ కృష్ణ కుమార్ డైరెక్షన్లో ఈ చిత్రం తెరకెక్కబోతుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబందించిన మొదటి షెడ్యూల్ పూర్తయిపోయింది. ఇప్పుడు మరో షెడ్యూల్ కూడా మొదలైపోయింది. 1960 కాలం నాటి ప్రేమకథ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కబోతుంది.ఇక ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడట ప్రభాస్. ప్రభాస్ కు జోడిగా పూజా హెగ్దే నటించబోతుండగా మరో హీరోయిన్ గా కాజల్ పేరు పరిశీలనలో ఉందట.

ఈ చిత్ర కథ పరంగా ప్రభాస్ ఓ పాత్రలో సిన్సియర్ లవర్ గా .. మరో పాత్రలో ప్లే బాయ్ గా కనిపించనున్నాడని తెలుస్తుంది. ఇక ఇప్పటివరకూ ఈ సినిమాలో నాయికగా పూజా హెగ్డే పేరు మాత్రమే వినిపించింది. ఇక ఓ సిన్సియర్ లవర్ కి జోడీగా పూజా హెగ్దే .. ప్లే బాయ్ పాత్ర కి కాజల్ కనిపించబోతుందని టాక్ నడుస్తుంది. ఈ వార్త బయటకి రావడంతో ఈ చిత్రం పై మరిన్ని అంచనాలు పెరుగుతున్నాయి. యూ.వీ. క్రియేషన్స్, గోపి కృష్ణ మూవీస్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందించనున్నాడు. ఇక ‘జాన్’ అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉన్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తూనే వున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus