కోలీవుడ్ హిట్ డైరక్టర్ తో సినిమా చేయనున్న ప్రభాస్

బాహుబలి 2 తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ డైరెక్షన్లో సాహో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. యువీ క్రియేషన్స్ బ్యానర్లో భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ వేగంగా సాగుతోంది. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రం తర్వాత సినిమాకి కూడా ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గోపి కృష్ణ ఫిలిమ్స్ బ్యానర్లో కృష్ణం రాజు నిర్మించనున్న ఆ సినిమాని జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహించనున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీలో ప్రభాస్ ఆస్ట్రాలజర్ గా కనిపించబోతున్నారు.

అయితే దీని తర్వాత ప్రభాస్ చేయనున్న సినిమా కూడా ఫిక్స్ అయిపోయినట్లు తెలిసింది. తమిళంలో ‘రాజా రాణి, తేరి’ వంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న యువ డైరక్టర్ అట్లీ .. రీసెంట్ గా మెర్సిల్ (అదిరింది) వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. దీంతో హీరోలందరూ అతను సినిమా చేయాలనీ భావిస్తుంటే.. అట్లీ మాత్రం బాహుబలితో సినిమా చేయాలనీ ఆశపడుతున్నారు. ఆశ పడడమే కాదు.. కథ కూడా వినిపించారు. అది ప్రభాస్ కి నచ్చడంతో ఒకే చెప్పినట్లు ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. దీన్ని కూడా యువీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ లు నిర్మించనున్నట్లు తెలిసింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus