అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ కు అతిథిగా ప్రభాస్

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కి ఎన్నో ఈవెంట్స్ నుంచి పిలుపు వచ్చింది. హాజరైతే లక్షలు ఇవ్వడానికి సైతం ముందుకొచ్చారు. కానీ ప్రభాస్ వాటి దరిదాపుల్లోకి వెళ్ళలేదు. కానీ ఓ ఈవెంట్ కి అడిగిన వెంటనే ఓకే చెప్పారు. అందుకోసం సాహో షూటింగ్ ని సైతం ఆపుకోవడానికి వెనుకాడలేదు. ఆ కార్యక్రమం వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ డ్రీమ్ గర్ల్, ప్రస్తుత పార్లమెంట్ మెంబర్ హేమమాలిని, దర్శకుడు మధూర్ భండార్కర్ లు సంయుక్తంగా నిర్వహిస్తున్న “వన్ ఫర్ ఆల్ – ఆల్ ఫర్ వన్” కార్యక్రమానికి దక్షిణాదికి సంబంధించి ప్రభాస్ కు ఆహ్వానం అందింది.

జనవరిలో “గేట్ వే ఆఫ్ ఇండియా” దగ్గర జరగబోతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ఈవెంట్ కు అతిధిగా వెళ్ళబోతున్నారు. మనదేశ సరిహద్దులలో సేవలు అందిస్తూ ఎన్నో త్యాగాలు చేస్తున్న వీర జవానుల త్యాగాలను స్మరిస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అధర్వా ఫౌండేషన్ నిర్వహణలో జరగబోతున్న ఈ కార్యక్రమంలో పాల్గొనడాన్ని ప్రభాస్ తన విధిగా భావిస్తున్నారు. అంతేకాదు     సైనికుల త్యాగాలకు సంబంధించి కాలేజీ విద్యార్దులు తీసిన 10 షార్ట్ ఫిలిమ్స్ కు తెలుగులో ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. ఈ లఘు చిత్రాలను దేశంలోని అన్ని ధియేటర్లలోను ప్రదర్శించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus