ప్రభాస్ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే న్యూస్?

యంగ్ రెబెల స్టార్ ప్రభాస్ త్వరలో బుల్లితెర పై దర్శనమివ్వనున్నాడట. ఓ టీవీ షోకు ప్రత్యేక అతిథిగా హాజరయ్యేందుకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ‘జీ తెలుగు’ చానెల్ లో నిర్వహించే ‘కొంచెం టచ్ లో ఉంటే చెబుతా’ కార్యక్రమానికి ప్రభాస్ గెస్ట్ గా రానున్నాడట. ప్రదీప్ మాచిరాజు హోస్ట్ గా వచ్చే ఈ షో కి సంబంధించి మరో సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. ఎలాగూ ‘సాహో’ చిత్రం ఆగష్టు 15 న విడుదల కాబోతుంది. ఈ చిత్రం హిందీ శాటిలైట్ రైట్స్ ను కూడా ‘జీ గ్రూప్’ దక్కించుకుందని టాక్ నడుస్తుంది. ఈ క్రమంలో ‘సాహో’ చిత్రం ప్రమోషన్లలో భాగంగా ప్రభాస్ ఈ షో కి హాజరవ్వబోతున్నట్టు తెలుస్తుంది.

ఎలాగూ ‘సాహో’ భారీ బడ్జెట్ చిత్రం కాబట్టి.. ఓ నెల ముందునుండే ప్రమోషన్లు మొదలు పెడితే బాగుంటుందని ప్రభాస్ భావిస్తున్నాడట. అందుకు ఇలాంటి షో అయితేనే కరెక్ట్ అని నిర్మాతలు కూడా చెబుతున్నారట. మొత్తానికి చాలా గ్యాప్ తర్వాత ప్రభాస్ ను బుల్లితెర పై కూడా చూడబోతున్నామన్న మాట. ఇక సుజీత్ డైరెక్షన్లో రాబోతున్న ఈ చిత్రాన్ని ‘యూవీ క్రియేషన్స్’ సంస్థ పై వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్నారు. శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగుతో పాటూ తమిళ, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రం ఏకకాలంలో విడుదల కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus