డిసెంబర్ లో సెట్స్ పైకి ప్రభాస్, సుజీత్ ల చిత్రం..!!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత చేయ బోయే సినిమా ఖరారు అయింది. రన్ రాజా రన్ చిత్ర దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో డార్లింగ్ నటించనున్నారు. థ్రిల్లర్ జాన్రా లో ఈ సారి ప్రభాస్ అలరించనున్నారు. యూవీ క్రియేషన్స్ వారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ప్రభాస్ కి పెరిగిన  క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ మూవీని తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ చిత్రంలో నటించే ఆర్టిస్టుల సెలక్షన్ ని కూడా సుజీత్ పూర్తి చేశారు.

ఐ సినిమాలో అందాలు ఆరబోసిన అమీ జాక్సన్ డార్లింగ్ తో జత కట్టనుంది. ఆమె ఇప్పుడు రోబో 2.0 షూటింగ్ లో బిజీగా ఉంది. ఈ చిత్రం పూర్తి కాగానే సుజీత్ బృందంలో జాయిన్ కానుంది. ప్రభాస్ కి విలన్ గా బాలీవుడు నటుడు నీల్ నితిన్ ముఖేష్ ఎంపిక పూర్తి అయింది. ఇతను తమిళ కత్తి సినిమాలో చూపించిన విలనిజం కి ఫ్లాట్ అయినా దర్శకుడు తెలుగు వారికి పరిచయం చేస్తున్నాడు. ప్రస్తుతం బాహుబలి కంక్లూజన్ క్లైమాక్స్  షూటింగ్ లో నిమగ్నమైన ప్రభాస్ నవంబర్ కి ఫ్రీ అవుతారు.

ఆ నెల అంతా రెస్ట్ తీసుకుని డిసెంబర్ నుంచి సుజీత్ సినిమా కోసం పని చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రం కోసం నిర్మాతలు  ఫిల్మ్ ఛాంబర్ లో ‘రాధ ప్రేమకథ’ అనే టైటిల్ ను రిజిస్ట‌ర్ చేయించినట్లు తెలిసింది. టైటిల్ హీరో గా పేరు సంపాదించుకున్నా ప్రభాస్ ఈ సారి కూడా తన పేరుతోనే సినిమా టైటిల్ ని ఓకే చేసినట్లు అనిపిస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus