రెబ‌ల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన “షేడ్స్‌ ఆఫ్ సాహో”

ప్ర‌పంచంలోని ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా ‘బాహుబలి చిత్రం గురించి మాట్లాడ‌ని సినిమా ప్రేక్ష‌కుడు లేడు. ప్ర‌పంచ సినిమా ప్రేక్ష‌కుడి కి తెలుగు సినిమా ని పరిచ‌యం చేసిన ఘ‌న‌త బాహుబ‌లి మాత్ర‌మే.. తెలుగు సినిమా స‌త్తాని ద‌మ్ముని తెలియ జేసిన బాహుబ‌లి చిత్రం తరువాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానుల ఉత్కంఠని మరింత పెంచుతూ మూడు భాషల్లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మెట్ట‌మెద‌టి చిత్రం ‘సాహో’. రన్ రాజా రన్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న సుజీత్ సాహోకి దర్శకుడు. యువి క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ ఈ భారీ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. వరల్డ్ వైడ్ గా ఉన్న రెబల్ స్టార్ ఫ్యాన్స్ అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న సాహో లుక్ ను అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా “షేడ్స్‌ ఆఫ్ సాహో ” విడుదల చేస్తున్నారు.. ఈ చిత్రం పై ప్ర‌భాస్ అభిమానులే కాకుండా సామాన్య ప్రేక్ష‌కుల్లో సైతం వున్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని షేడ్‌ ఆఫ్ సాహు ని ఛాప్ట‌ర్స్ గా విడుద‌ల చేయ‌నున్నారు. గతంలో బాహుబలి కంక్లూజన్ ఫస్ట్ లుక్ ని సైతం రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగానే విడుదల చేయడం జరిగింది. అదే ఆనవాయితిని కొనసాగిస్తూ మరోసారి ఈ షేడ్‌ ఆప్ సాహో ని ఫ్యాన్స్ కి బర్త్ డే ట్రీట్ ఇచ్చారు రెబల్ స్టార్ ప్రభాస్. ఈ లుక్ ప్రభాస్ అభిమానుల్నే కాకుండా సామాన్య సినీ ప్రేక్షకుల్ని సైతం ఆకట్టుకోవడమే కాదు వారిలో మరింత ఉత్కంఠని పెంచింది. రిలీజ్ చేసిన ఒన్ మినిట్ 22 సెకండ్స్ విజువ‌ల్ వండ‌ర్ ప్రేక్ష‌కుడ్ని రిపీట్ చూసేలా ఆక‌ట్టుకుంది.. ఇలాంటి విజువ‌ల్ ఇండియ‌న్ సినిమాలో ఇప్ప‌టివ‌ర‌కూ రాలేద‌నే చెప్పాలి..

ఏప్రిల్ లో సాహో ప్రాజెక్ట్ ఎనౌన్స్ మెంట్ జరగడం ఆ తరువాత బాహుబలి 2తో పాటు సాహో టీజర్ ని విడుదల చేయడం, ఇప్పుడు ప్రభాస్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన “షేడ్స్‌ ఆఫ్ సాహో” ఈ చిత్రం పై భారీగా అంచనాలు పెంచాయి. అందుకు తగ్గట్లుగానే యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్-విక్కి ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాహోని ఓ విజువల్ వండర్ గా తీర్చిదిద్దేందుకు దర్శకుడు సుజిత్ తో పాటు హాలీవుడ్, బాలీవుడ్ కి చెందిన ప్రముఖ సాంకేతిక నిపుణులు రంగంలోకి దిగారు. సాహోలో ప్రభాస్ తో బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ శ్రద్ధా కపూర్ ఫిమేల్ లీడ్ చేస్తుంది. హైలీ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో మైమరపించే యాక్షన్ సన్నివేశాలను అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల పర్యవేక్షణ లో ఇటలీలో చిత్రీకరిస్తున్నారు. బాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ త్రయం శంకర్ -ఎహసాన్-లాయ్ ఈ చిత్రానికి సంగీతమందిస్తున్నారు. హిందీ లిరిక్స్ ను… అమితాబ్ భట్టాచార్య అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మధి, ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరీల్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ వంటి టాప్ టెక్నీషియన్స్ సాహో చిత్రానికి వర్క్ చేస్తుండడం విశేషం. ప్రేక్షకుల, అభిమానుల అంచనాలను అందుకునేలా సాహోలో ప్రభాస్ స్టైలిష్ గా, ఓ కొత్త ఎనర్జీ తో కనిపించబోతున్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ… పాన్ ఇండియా సూప‌ర్‌స్టార్‌ ప్రభాస్ హీరోగా మూడు భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా మా బ్యానర్లో నిర్మిస్తున్న చిత్రం సాహో. ప్ర‌భాస్ గారి గ‌త‌ భ‌ర్త‌డే కి టీజ‌ర్ రిలీజ్ చేశాం.. త‌రువాత షూటింగ్ లో మా యూనిట్ అంతా బిజిగా వున్నారు. అయితే ఇండియా మెత్తం ప్ర‌భాస్ గారి అభిమానులు సాహో అప్‌డేట్స్ ఇవ్వ‌మ‌ని విప‌రీతంగా సోష‌ల్ మీడియాలో అడ‌గ‌టం తో మా యూనిట్ వారి ఆనందాన్ని రెట్టింపు చెయ్యాల‌నే వుద్దేశ్యంతోనే “షేడ్స్‌ ఆఫ్ సాహో ” పేరున ఛాప్ట‌ర్స్ గా అందివ్వ‌నున్నారు. దానిలో భాగంగా ప్ర‌భాస్ గారి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా “షేడ్ ఆఫ్ సాహో ఛాప్ట‌ర్‌-1” ని విడుద‌ల చేశాము. అద్భుతమైన స్పందన రావడం చాలా హ్యాపీ గా ఉంది. ప్రస్తుతం ఇటలీ లో చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికి దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తయింది. ప్రభాస్ స్టైలిష్ పెర్ఫార్మన్స్, సుజిత్ వరల్డ్ క్లాస్ విజన్, శ్రద్ధా కపూర్ అందచందాలు, బాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ త్రయం శంకర్ -ఎహసాన్-లాయ్ టాప్ క్లాస్ మ్యూజిక్, మధి గ్రాండియర్ విజువల్స్ సినిమాకు హైలైట్ గా నిలుస్తాయి. అని అన్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus