ఆ టైటిల్ పై మనసు పాడేసుకున్న ప్రభాస్..!

‘బాహుబలి’ చిత్రంతో జాతీయ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఇక ప్రభాస్ తాజా చిత్రం ‘సాహూ’ చిత్రాన్నికూడా భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది యూవీ క్రియేషన్స్ సంస్థ. ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని ఆగష్టు 15 న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఇక ఈ చేస్తూనే ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్లో తన 20 వ చిత్రాన్ని కూడా మొదలు పెట్టేసాడు ప్రభాస్.

పిరియాడిక్ మూవీగా ఈ చిత్రం తెరకెక్కబోతుందని తెలుస్తోంది. 1960 లలో జరిగే ప్రేమ కథగా ఈ చిత్రం తెరకెక్కబోతుంది. ‘గోపి కృష్ణ మూవీస్’ ‘యూవీ క్రియేషన్స్’ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ‘జాను’ అనే టైటిల్ దాదాపుగా ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఇంకా అధికారికంగా ప్రకటించినప్పటికీ… చిత్ర యూనిట్ దాదాపు ‘జాను’ టైటిల్ ను కన్ఫర్మ్ చేసినట్టు టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా ప్రభాస్ ఈ టైటిల్ బాగా ఆసక్తి చూపిస్తున్నాడట. చాల ఫంక్షన్లలో ప్రభాస్ ‘జాన్ జిగిరే’ అంటూ సరదాగా కొంత మందితో ఉన్న స్నేహాన్ని వివరిస్తుంటాడు. ఇక ‘జాను’ రెండు అక్షరాల టైటిల్ అవ్వడంతో పాటు – జాను అంటే హిందీలో ‘డార్లింగ్’ అనే అర్థం వస్తుంది కాబట్టి.. ప్రభాస్ ఈ టైటిల్ పై ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తుంది. చాలా ప్లాపులు వచ్చిన తరుణంలో ‘డార్లింగ్’ చిత్రం ప్రభాస్ కు హిట్టిచ్చి ఫామ్ లోకి వచ్చేలా చేసింది. అంతే కాదు ‘బుజ్జిగాడు’ చిత్రాల్లో డార్లింగ్ అంటూ ప్రభాస్ పలకడం.. చెప్పాలంటే ప్రభాస్ అసలు క్రేజ్ ఆ చిత్రం నుండే మొదలయ్యింది. ‘బుజ్జిగాడు’ చిత్రం యావరేజ్ గా నిలిచినప్పటికీ ప్రభాస్ ని… మాత్రం ఇండస్ట్రీలో అందరికీ డార్లింగ్ ని చేసింది. ఇక ‘ప్రభాస్ 20’ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్దే నటిస్తుంది. ఈ చిత్రాన్ని 2020 సంక్రాంతికి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ ఆలోచనలో ఉందట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus