ఇదివరకు కనిపించని పాత్రలో ప్రభాస్!

బాహుబలి 2 తర్వాత యంగ్ రెబల్ స్టార్ ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ డైరెక్షన్లో సాహో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. యువీ క్రియేషన్స్ బ్యానర్లో భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ వేగంగా సాగుతోంది. ఈ చిత్రం తర్వాత సినిమాకి కూడా ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.  జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో నటించనున్నారు. ఇది 1980 లో లండన్ లో జరిగే ఓ రొమాంటిక్ లవ స్టోరీ అని తెలిసింది.  ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ లో ప్రభాస్ రోల్ బయటికి వచ్చింది. ఆస్ట్రాలజర్ గా డార్లింగ్ కనిపించబోతున్నట్లు సమాచారం.

గ్రహాల పరిస్థితిని అంచనా వేసి జాతకాలు చెప్పే పాత్రలో మెరవనున్నారు. ఈ క్యారక్టర్ వినడానికే క్రేజీగా ఉంది. ఆ పాత్రలో ప్రభాస్ కనిపిస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ మధ్య హీరోలు ఎవరూ ఈ పాత్ర పోషించలేదు. అందుకే ఈ కథకు ప్రభాస్ ఒకే చెప్పినట్లు తెలిసింది. ఈ మూవీ కూడా యూవీ క్రియేషన్స్ బ్యానర్లో నిర్మితం కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus