ప్రభాస్ ఇక్కడికి రాకపోతే చచ్చిపోతాను అంటున్న యువకుడు!

సాహో సినిమాలో శ్రద్ధకపూర్ ఎవరు వీళ్ళు ఇంత వైలెంట్ గా ఉన్నారు అని అడిగినప్పుడు ప్రభాస్ సింపుల్ గా “డై హార్డ్ ఫ్యాన్స్” అని చెబుతాడు. ఇప్పుడు అలాంటి డైహార్డ్ ఫ్యాన్ ఒకడు ప్రభాస్ ను ఇంచుమించు బెదిరించినంత పని చేస్తున్నాడు. గులుగులోటు వెంకన్న అనే వ్యక్తి జనగాంలో సెల్ టవర్ ఎక్కి.. ప్రభాస్ వచ్చి నన్ను కలవాలి, లేకపోతే నేను ఇక్కడ్నుంచి దూకేస్తా అని బెదిరించడం మొదలెట్టాడు. పాపం అతని బంధువులు, తల్లిదండ్రులు, పోలీసులు ఎంతమంది చెప్పినా కిందకి రావడం లేదట.

మరి వెంకన్న కోరిక మేరకు ప్రభాస్ వస్తాడా లేదా ఏదైనా మెసేజ్ ఇస్తాడా అనేది తెలియదు కానీ.. ఈ వెంకన్న చేసే హడావుడి మాత్రం మామూలుగా లేదు. అయితే.. ఇలా సెల్ టవర్ ఎక్కి దూకేస్తానని బెదిరించేవాళ్లని కలవడం వలన ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకాస్త పెరగే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. మరి దీనికి సోల్యూషన్ ఏమిటో?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus