The Raja Saab: ప్రభాస్ ఆ పని చేస్తే మాత్రం సంక్రాంతి విజేతగా నిలవడం పక్కా!

  • July 20, 2024 / 11:08 PM IST

ప్రభాస్ (Prabhas) మారుతి (Maruthi) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాజాసాబ్ (The Raja Saab) మూవీపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయనే సంగతి తెలిసిందే. ప్రభాస్ గత సినిమాలు భారీ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవడం, రాజాసాబ్ మూవీ పక్కా కమర్షియల్ ఫార్మాట్ లో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కథాంశంతో తెరకెక్కుతుండటంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి. 2025 సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా విడుదల కానుందని ఇప్పటికే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

అయితే ఈ సినిమాను సంక్రాంతి పండుగకు వారం రోజుల ముందే విడుదల చేసే విధంగా మేకర్స్ ప్లాన్ ఉందని తెలుస్తోంది. ఈ విధంగా చేయడం వల్ల వారం రోజుల వరకు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్లలో రాజాసాబ్ మాత్రమే ప్రదర్శితం అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. తర్వాత రోజుల్లో థియేటర్లు తగ్గినా సంక్రాంతి సెలవులను ఈ సినిమా క్యాష్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.

ప్రభాస్ సంక్రాంతికి వారం ముందు ఈ సినిమాను రిలీజ్ చేసి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఈ సినిమా సంక్రాంతి విజేతగా నిలవడం పక్కా అని చెప్పవచ్చు. రాజాసాబ్ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్ డేట్స్ అతి త్వరలో రానున్నాయని తెలుస్తోంది. సలార్ (Salaar) , కల్కి (Kalki 2898 AD) సినిమాల విజయాలతో ప్రభాస్ సినిమాల నాన్ థియేట్రికల్ హక్కులకు ఊహించని స్థాయిలో డిమాండ్ నెలకొంది.

రాజాసాబ్ సినిమాలో ఒక రీమిక్స్ సాంగ్ ఉందంటూ కొన్నిరోజుల క్రితం ప్రచారం జరగగా ఆ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని తేలిపోయింది. ప్రభాస్ ఆరు నెలలకు ఒక సినిమా రిలీజయ్యేలా ప్లాన్ చేసుకుంటూ కెరీర్ విషయంలో తెలివిగా అడుగులేస్తున్నారు. ప్రభాస్ గెస్ట్ రోల్ లో నటించిన కన్నప్ప ఈ ఏడాది డిసెంబర్ లో రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతోంది. జనవరి 3 లేదా 4 తేదీలలో రాజాసాబ్ సినిమా విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus