Pragya Jaiswal, Salman Khan: ఆ హీరో కంగారు పెట్టాడంటున్న ప్రగ్యా జైస్వాల్!

టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ అఖండ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. అఖండ ప్రగ్యా జైస్వాల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోగా నిన్నటినుంచి ఈ సినిమా ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ఓటీటీలో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు ప్రగ్యా జైస్వాల్ తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసిందని కామెంట్లు చేస్తున్నారు.

అఖండ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ పాత్ర నిడివి తక్కువే అయినా ఈ సినిమా ఆమె కెరీర్ కు ప్లస్ అయింది. సీనియర్ హీరోలను హీరోయిన్ల కొరత వేధిస్తున్న నేపథ్యంలో సీనియర్ హీరోలకు ప్రగ్యా జైస్వాల్ బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది. బాలకృష్ణ సైతం తన తర్వాత సినిమాల్లో ప్రగ్యా జైస్వాల్ కు హీరోయిన్ రోల్ ఆఫర్ చేసే ఛాన్స్ అయితే ఉందనే కామెంట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. అయితే అఖండ తర్వాత ప్రగ్యా జైస్వాల్ కు బంపర్ ఆఫర్ తగిలింది.

అంతిమ్: ది ఫైనల్ ట్రూత్ కొరకు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కు జోడీగా ప్రగ్యా జైస్వాల్ డ్యాన్ చేసిన ఒక పాట తాజాగా విడుదలైంది. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ప్రగ్యా జైస్వాల్ పేరు మారుమ్రోగుతోంది. సల్మాన్ తో కలిసి డ్యాన్స్ స్టెప్పులు వేయడం గురించి ప్రగ్యా జైస్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సల్మాన్ తో స్టెప్పులు వేయాలంటే కంగారు పడ్డానని, నెర్వస్ గా ఫీలయ్యానని ప్రగ్యా తెలిపారు.

అంతిమ్: ది ఫైనల్ ట్రూత్ మూవీ కొరకు సల్మాన్ ఖాన్ తో వేసిన స్టెప్పుల వల్ల జన్మ ధన్యమైందని ప్రగ్యా జైస్వాల్ చెప్పారు. సినిమాలో సాంగ్ కు ఇంపార్టెన్స్ ఉంటుందని ఈ సాంగ్ లో డ్యాన్స్ చేసే ఛాన్స్ రావడం తనకు సంతోషాన్ని కలిగిస్తోందని ప్రగ్యా జైస్వాల్ వెల్లడించారు. సినిమాకు ఈ పాటకు సంబంధం లేదని అయితే పాట ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుందని ప్రగ్యా జైస్వాల్ వెల్లడించడం గమనార్హం.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus