బాలయ్యకు ఆహ్వానం లేకుండా జరిగిన కొన్ని సమావేశాల విషయంలో ఆయన స్పందించిన తీరు పెద్ద చర్చకు తెరలేపింది. బాలయ్యను పిలవకుండా పరిశ్రమకు సంబంధించిన ముఖ్య సమావేశాలు నిర్వహించిన చిరంజీవి తప్పు చేశారా? ఆవేశపూరిత ఆరోపణలు చేసిన బాలయ్య తొందరపడ్డాడా? అనే ప్రశ్న ఇప్పుడు మొదలైంది. ఈ విషయలో ఇండస్ట్రీ రెండు వర్గాలుగా విడిపోయింది. కొందరు బాలయ్యను మరికొందరు చిరంజీవిని సపోర్ట్ చేస్తున్నారు. కాగా ఈ విషయంపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. ఒక విధంగా ఆయన చిరంజీవిని సమర్ధించారు.
ఆయన మాట్లాడుతూ ‘నాకు బాలయ్య, అన్నయ్య చిరంజీవి ఇద్దరు కూడా బాగా తెలుసు. ఈ వివాదం విషయానికి వస్తే.. అన్నయ్య చిరంజీవి ఓ నలుగురు కలిసి వెళ్లి ఆయనతో కూర్చుని మాట్లాడారు. అందులో తప్పిదం ఉందని నేను అనుకోను అన్నారు. పరిశ్రమలో పెద్దగా ఓ నిర్ణయం తీసుకున్నారు. బాలయ్య అవసరం ఉందనుకుంటే ఆయన్ని కూడా పిలిచేవారు. ఇలాంటి విషయాలలో ఇగోలకు పోవడం సరికాదు. అలాగే మీడియా కూడా ఈ విషయాన్ని పెద్దది చేయడం సరికాదని ఆయన హితవు పలికారు.
ఐతే ఈ వ్యాఖ్యలు బాలయ్య అభిమానులకు కోపం తెప్పించాయి. ఇండస్ట్రీకి చిరంజీవి ఒక్కడే పెద్ద కాదని, ఒక వేళ ఆయన పెద్దరికం తీసుకున్నా, అందరినీ కలుపుకు పోవాలి అని వారు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై కోపం వ్యక్తం చేస్తున్నారు. ఇరువర్గాల మధ్య వాదోపవాదనలు కొనసాగుతుండగా, ఈ విషయం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. కాగా ఈ విషయంపై చిరంజీవి ఇంత వరకు నోరు మెదపక పోవడం విశేషం.
మేకప్ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్ వందాల్’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!