బాలయ్య చేసింది కరెక్ట్ కాదు : ప్రకాష్ రాజ్

ఇండస్ట్రీ బాగోగుల గురించి జరుగుతున్న మీటింగ్ లకు తనని పిలవలేదు అంటూ బాలకృష్ణ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. అక్కడితో ఆగకుండా ‘గ్రూప్ లు కూడా మెయింటైన్ చేస్తున్నారు… తలసానితో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారా?’ అంటూ కామెంట్స్ చేసి పెద్ద ధుమారం రేపాడు బాలయ్య. దీంతో మెగా బ్రదర్ నాగ బాబు కూడా బాలయ్య పై మండిపడుతూ కామెంట్స్ చెయ్యడంతో.. ఈ ఇష్యు మరింత పెద్దదైంది. బాలయ్యను ‘మీటింగ్ లకు పిలవకపోవడం కూడా తప్పే’ అంటూ కొందరు ఇండస్ట్రీ పెద్దలు కూడా అభిప్రాయపడుతున్నారు.

ఇలాంటి టైములో ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ మరింత హాట్ టాపిక్ గా మారాయి. ఆయన చేసిన కామెంట్స్ బాలకృష్ణకు చురకలు పెట్టే విధంగా ఉన్నాయనే చెప్పాలి. ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. “నాకు బాలయ్య బాబు తెలుసు. అలాగే చిరంజీవి గారు కూడా తెలుసు. ఇప్పుడు చిరంజీవి గారు ఇండస్ట్రీ పెద్దగా.. ఇండస్ట్రీ బాగోగులు చూసుకుంటున్నారు.ఇప్పుడు షూటింగ్ లు ఆగిపోయిన తరుణంలో.. ఇండస్ట్రీకి సంబంధించిన కొంత మంది ప్రొడ్యూసర్స్, చిరంజీవి గారితో కూర్చొని మాట్లాడారు. అందులో తప్పేమీ లేదు. దానికి నన్ను కూడా పిలవలేదు.

‘మమ్మల్ని పిలవలేదు’ అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. చిరంజీవి గారికి పెద్దరికం ఉంది. ఇండస్ట్రీకి ఇపుడున్న పెద్ద దిక్కు ఆయనే. వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత ఏదైనా అవసరం ఉంటే పిలుస్తారు. ప్రతీ మీటింగ్‌కు అందరూ వెళ్ళాల్సిన అవసరం లేదు. బాలయ్య బాబుకి ఓ పెద్ద మాట చెప్పాలి అనేమీ కాదు కానీ.. పిలవకపోయినంత మాత్రాన ఎలాంటి ప్రాబ్లెమ్ లేదు. చిరంజీవి ఇంట్లో నలుగురు ఇండస్ట్రీ పెద్దలు కూర్చొని ఈ సమస్య పరిష్కారం గురించి మాట్లాడుకున్నారు. తరువాత బాలయ్యను పిలిచేవారేమో..! కాబట్టి బాలయ్య ఎదురుచూసి ఉంటే బాగుండేది. ఇండస్ట్రీలో ఈగోలు తప్పు” అంటూ చెప్పుకొచ్చాడు.


మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus