ఎన్టీఆర్ కు ఘన స్వాగతం పలికిన ప్రణతి..!

ఇద్దరు స్టార్ హీరోలు అయిన ఎన్టీఆర్, రాంచరణ్ లతో రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. గత కొద్ది రోజుల నుండీ బల్గెరియాలో ఎన్టీఆర్ పై కొన్ని యాక్షన్ సీన్లు చిత్రీకరిస్తున్నాడు రాజమౌళి. ఇప్పుడు ఆ చిత్రీకరణ పూర్తవ్వడంతో తిరిగి హైదరాబాద్ చేరుకున్నాడు ఎన్టీఆర్. ఇక ఎన్టీఆర్ ను రిసీవ్ చేసుకోడానికి తన భార్య ప్రణతి ఎయిర్ పోర్ట్ కి వచ్చింది. తన భర్తతో కలిసి ప్రణతి వస్తున్న సందర్భాన్ని కొంతమంది ఫోటోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఇప్పుడు ఆ ఫోటోలు తెగ వైరలవుతున్నాయి.

ఈ ఫోటోలలో ప్రణతి ‘టి షర్ట్ ధరించుకుని ఉండగా… ఎన్టీఆర్ క్యాప్ ధరించుకుని ఉన్నాడు. ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ పాత్ర కు సంబందించిన ఫస్ట్ లుక్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే చరణ్ కు సంబంధించి అల్లూరి సీతారామ రాజు లుక్ పై అందరికీ క్లారిటీ వచ్చేసింది. పైగా ఇప్పటికే అల్లూరి సీతారామ రాజు పాత్రని రెండు, మూడు సార్లు ప్రేక్షకులు చూసేసారు. అందులోనూ పెద్ద పెద్ద మీసాలతో చరణ్ కనిపిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఆ లుక్ బయటకి వచేసినట్టే..! కానీ కొమరం భీమ్ పాత్ర ప్రేక్షకులకి పెద్దగా పరిచయం లేదు. దీంతో అందరూ ఈ పాత్ర లుక్ కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ తరువాతి షెడ్యూల్ హైదరాబాద్ లో ఉంటుందని తెలుస్తుంది. ఈ షెడ్యూల్ లో చరణ్ అలాగే హీరోయిన్ అలియా భట్ పాల్గొనబోతున్నారని సమాచారం..!

1

2

3

PC: PINKVILLA

గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus